సాయి ధరమ్ తేజ్ పేరుతో మోసం.. డబ్బు వసూళ్లతో దందా.. రంగంలోకి సుప్రీం హీరో

ఒక్కోసారి కొన్ని వార్తలు వింటే నవ్వు వస్తుంటుంది. అయితే చివరకు అవే వార్తలు ఎంతో సీరియస్‌గా మారుతుంటాయి. ఆ మధ్య సోషల్ మీడియాలో ఓ మోసం కంటిన్యూగా జరుగుతూ వచ్చేది. ఫేస్ బుక్‌లో నకిలీ ఖాతాలు ఓపెన్ చేసి.. సదరు ఖాతాలోని ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్న వారిని డబ్బు సాయం చేయాల్సిందిగా కోరేవారు. అడిగేది తమ స్నేహితుడే అని కొందరు పొరబాటు పడి డబ్బులు కూడా పంపేవారు. అలాంటి మోసాల గురించి ఎన్నో చదివి ఉంటారు. ఇలాంటి ఘటనలన్నీ సాధారణ వ్యక్తుల విషయాల్లో జరుగుతుంటాయి. కానీ సుప్రీమ్ హీరో విషయంలోనూ జరగడం ఆశ్చర్యకరం. సాయి ధరమ్ తేజ్‌కు అవసరం పడి తన తోటీ నటీనటులను 15 వేలు అడగడం ఏంటో గానీ.. ఈ విషయంపై సాయి ధరమ్ తేజ్ వెంటనే స్పందించి పోలీసుల సాయం తీసుకున్నారు. ఈ మేరకు అందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ సాయి ధరమ్ తేజ్ ఓ ప్రెస్ నోట్ వదిలారు. నా పేరు మీదుగా నేను నటించిన కో ఆర్టిస్ట్, ఇతర సభ్యుల దగ్గర డబ్బులు వసూళ్లు చేస్తున్నారని నాకు తెలిసింది. నాకు ఆర్థిక సాయం కావాలని వారిని డబ్బులు అడుగుతున్నానట. ఈ విషయంపై నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాను. మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి.. అలాంటి వాటిని నమ్మకండి.. నా పేరు మీద వచ్చే మెసెజ్‌లను పట్టించుకోకండి అని సాయి ధరమ్ తేజ్ ప్రకటన చేశారు. ఇక ఈ విషయంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అలా మోసం చేసేవాడికైనా సిగ్గు ఉండాలి.. డబ్బులు పంపేవాడికైనా సిగ్గుండాలి.. మెగా హీరో, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్‌కు ఆర్థిక కష్టాలు ఏంటో? 15 వేలు అడగడం ఏంటో అని నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ