నచ్చుతుందని ఆశిస్తున్నానంటూ పోస్ట్.. రాధిక న్యూ లుక్ వైరల్

సీనియర్ నటి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే.బుల్లితెరపై ఓ సంచలనం. వెండితెరపై తన సత్తా చాటి స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోయిన రాధిక.. బుల్లితెరనూ ఏలేశారు. ఇంకా దూసుకుపోతూనే ఉన్నారు. అయితే ఈ మధ్య మాత్రం బుల్లితెరకు కాస్త విరామం ఇచ్చారు. అది కూడా రాజకీయ ఎంట్రీతో వచ్చిన గ్యాప్. మొన్నటి తమిళ నాట ఎన్నికల్లో కమల్ హాసన్ తరుపున రాధిక బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అలా రాజకీయాలతో బిజీగా ఉండటంతో రాధిక పిన్ని 2 సీరియల్ నుంచి తప్పుకున్నారు. తమిళంలో చిట్టి సీరియల్ పిన్నిగా డబ్ అయి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే గత ఏడాదే పిన్ని 2 (చిట్టి 2) సీరియల్ ప్రారంభం అయింది. మంచి ఊపులో సీరియల్ సాగుతున్న తరుణంలో రాధిక తప్పుకున్నారు. అయితే ఇప్పుడు రాధిక తన అవతరాన్ని మార్చేశారు. రాధిక చివరగా ఓ చెక్ బౌన్స్ కేసులో వార్తల్లోకి ఎక్కారు. రాడాన్ సంస్థకు సంబంధించిన లావాదేవీల్లో చెక్ బౌన్స్ కేసులో రాధిక, శరత్ కుమార్ ఇద్దరికి కూడా జైలు శిక్ష పడింది. అయితే దీనిపై హైకోర్టులో కేసు వేస్తామని, మీడియా రాసే వార్తలను నమ్మకండని రాధిక సోషల్ మీడియాలో స్పందించారు. అయితే ఇప్పుడు తాజాగా రాధిక తన కొత్త లుక్కుకు సంబంధించి ఓ పోస్ట్ చేశారు. తన జుట్టును కత్తిరించుకుని కనిపించారు. తన కొత్త లుక్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. రాధిక ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా వస్తోన్న ఓ చిత్రంలో నటిస్తున్నారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ