భవిష్యత్ తలచుకుంటే బాధేస్తోంది.. ఆ రూల్ తీసుకురండి.. ప్రభుత్వాలకు సోనూసూద్‌ విజ్ఞప్తి

కష్టకాలంలో రియల్ హీరో అనిపించుకుంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్న సినీ నటుడు సోనూసూద్ దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. పల్లె, పట్నం అనే తేడాలేకుండా మహమ్మారి వైరస్ వీరవిహారం చేస్తోంది. ఎంతోమంది కరోనా కాటుకు బలవుతుండటం ఆందోళన కలిగితోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలకు ఓ విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అండగా నిలబడాలని కోరారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో వీడియో ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహా ఎన్‌జీఓలకు ఆయన రిక్వెస్ట్ చేశారు. ''8 నుంచి 12 సంవత్సరాలు వయసున్న ఎంతోమంది చిన్నారులు కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోతున్నారు. చాలా కుటుంబాల్లో తల్లో, తండ్రో లేకపోతే ఇద్దరూ చనిపోయి పిల్లలు అనాథలవుతున్నారు. ''అలాంటి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే నాకెంతో బాధేస్తోంది. కాబట్టి అలాంటి పిల్లలకు అండగా నిలబడాల్సిన అవసరం ఎంతో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్‌జీవోలు ఇలాంటి పిల్లలకు అండగా నిలబడి వారికి ప్రాథమిక విద్య నుంచి కాలేజీ విద్య వరకు ఉచితంగా అందించాలి. ఇలా ప్రభుత్వాలు ఓ రూల్‌ను తీసుకు రావాలి'' అని సోనూసూద్‌ విజ్ఞప్తి చేశారు. కరోనా కారణంగా గతేడాది భారతదేశ వ్యాప్తంగా ఏర్పడిన సంక్షోభంలో పేదలకు, రోజు వారి కార్మికులకు అండగా నిలిచారు సోనూసూద్. ఇటు పనిలేక, అటు స్వస్థలాకు చేరుకోలేక బాధపడుతున్న వారిని తన సొంత ఖర్చుతో ఇంటికి చేర్చాడు. అంతేకాక ఉపాధి కోల్పోయిన వారికి కూడా తగిన సహాయంతో పాటు ఉపాధి కూడా కల్పించాడు. అలా అందరిచేత రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్.. సెకండ్ వేవ్ లోనూ పలు సహాయక కార్యక్రమాలు చేస్తున్నారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ