అమ్మ బాబోయ్ అంత అర్థముందా?.. రష్మిక మందాన్న టాటూ సీక్రెట్ లీక్

సెలెబ్రిటీలకు టాటూలు అంటే మహా పిచ్చి. మరీ ముఖ్యంగా హీరోయిన్లు ఏదో ఒక సూక్తి, జీవిత సత్యం గురించి చెప్పే మాటలను పచ్చబొట్లుగా పొడిపించుకుంటారు. లేదా ఇంకొందరు కొన్ని సింబల్స్‌ను టాటూలుగా వేయించుకుంటారు. అలా చేతికి కూడా ఓ టాటూ ఉంటుంది. ఆ టాటూ అర్థం ఏంటో ఇది వరకు ఎన్నో సార్లు చెప్పినా కూడా తాజాగా మరో క్లుప్తంగా వివరించేశారు. రష్మిక మందాన్న సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. తాజాగా రష్మిక మందాన్న తన ఇన్ స్టాగ్రాంలో లైవ్‌లోకి వచ్చారు. తన ఫాలోవర్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధనాలు చెప్పారు. కొన్నింటికి తప్పించుకుంటూ తన తెలివిని ప్రదర్శించారు. అయితే కొన్ని మాత్రం చేయలేనని నిర్మొహమాటంగా చెప్పేశారు. అన్నింటి కంటే ముందు కరోనా గురించి తన అభిమానులకు ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. ప్రస్తుతం మనమంతా దారుణమైన స్థితిలో ఉన్నామని, అవసరమైతే గానీ బయటకువెళ్లకండని సూచించారు. తాను ఇప్పుడు పుష్ప షూటింగ్‌లో ఉన్నానని అందుకే హైద్రాబాద్‌లో ఉన్నానని చెప్పుకొచ్చారు. షూటింగ్ లొకేషన్‌లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కానీ తాజాగా బన్నీకి కరోనా పాజిటివ్ వచ్చేసింది. అలా లైవ్‌లో అభిమానులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానమిచ్చిన రష్మిక తన టాటూ గురించి అడగడంతో ఎంతో వివరంగా చెప్పారు. తన టాటూ అర్థమంటూ ఎంతో స్పష్టంగా చెప్పారు. నీలాంటి వాళ్లు ఒక్కరే ఉంటారు.. నిన్ను ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు.. నీకు నువ్వే ఉండాలి.. నీకు నువ్వే మిగులుతావ్.. ఇర్రిప్లేసబుల్ అని అంటూ టాటూ గురించి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను బాలీవుడ్‌లో రెండు ప్రాజెక్ట్‌లు చేస్తున్నానని, మరో ప్రాజెక్ట్ చర్చల్లో ఉందని త్వరలోనే ఓకే అయ్యే అవకాశాలున్నాయని తెలిపారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ