అమూల్యకు బంటీ కంపెనీ.. బన్నీకి కరోనా రావడంపై పూజా హెగ్డే సెటైర్స్

టాలీవుడ్ స్టైలీష్ స్టార్ లేదా ఐకాన్ స్టార్ ఎలా పిలిచినా అందరికీ గుర్తొచ్చేది మాత్రం . బన్నీ ప్రస్తుతం ఐసోలేట్ అయ్యారు. కరోనా ఇంత ఉధృతంగా ఉన్నా కూడా సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే హైద్రాబాద్‌లోనే భారీ సెట్ వేసి పుష్ప షూటింగ్‌ను కానిచ్చేస్తున్నారు. కానీ ఇంత లోపే కరోనా అడ్డు కట్ట వేసేసింది. బన్నీకి కరోనా పాజిటివ్ రావడంతో అంతా తారుమారైంది. అనసూయ, రష్మిక మందాన్నలతో అదిరిపోయే సీన్లు తెరకెక్కిస్తోన్న సుకుమార్‌కు షాక్ తగిలినట్టైంది. ప్రస్తుతం అన్ని జాగ్రత్తలు తీసుకుని క్వారంటైన్ అయ్యాడు. డాక్టర్ల సలహా మేరకు ఐసోలేషన్‌లో ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తనను కలిసిన వారంతా కూడా పరీక్షలు చేసుకోవాలని, అందరూ జాగ్రత్తగా ఉండాలని బన్నీ సూచించారు. బన్నీ ఇలా చేసిన ట్వీట్ మీద వెరైటీగా స్పందించారు. పూజా హెగ్డేకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వారం ప్రారంభంలోనే పూజా హెగ్డే కరోనా బారిన పడ్డారు. ఆమె కూడా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంటున్నారు. అయితే బన్నీకి కూడా కరోనా రావడంపై పూజా హెగ్డే స్పందించారు. అల వైకుంఠపురములో సినిమాలోని పాత్రలను తలుచకుంటూ బంటూ (బన్నీ) అమూల్య (పూజా హెగ్డే పాత్ర పేరు)కు తోడుగా ఉండేందుకు వచ్చినట్టున్నాడు.. జాగ్రత్తగా ఉండు అల్లు అర్జున్.. నీకు కొంచెం శక్తిని పంపిస్తున్నాను.. నువ్వెప్పుడూ బాగానే ఉంటావ్ అని చెప్పుకొచ్చారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ