2022లో ఒక్కరు కూడా మిగలరు! అమ్మాయి టీ- షర్ట్ చూపిస్తూ ఆర్‌జీవీ షాకింగ్ కామెంట్స్

దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఉదృతంగా పెరిగిపోతున్నాయి. లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. బయటకు వచ్చినా.. మాస్కులు ధరిస్తూ.. భౌతిక దూరం పాటిస్తున్నారు. ఒకవేళ పొరపాటున కరోనా నిబంధనలు పాటించకపోతే.. వెంటనే వైరస్ అంటుకుంటుంది. ఇక వైరస్ సోకిన వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆస్పత్రిలో సరైన వైద్య సౌకర్యాలు అందక వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు స్మశానవాటికల్లో చోటు లభించకపోవడం మరో దురదృష్టకర విషయం. వివాదాస్పద దర్శకుడు ఈ మధ్య తన రూటు మార్చారు. ఆ మధ్యకాలంలో కేవలం సినిమాలపై సినిమాకు సంబంధించిన వ్యక్తులపైనే ట్వీట్ చేసిన ఆయన గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న కరోనా కేసులపై ట్వీట్ చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఉత్తరాఖండ్‌లో జరిగిన కుంభమేళాపై వర్మ చేసిన ట్వీట్లు తీవ్ర దుమారం రేపాయి. కరోనా తీవ్రంగా వ్యాపిస్తుంటే.. కుంభమేళకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరుకావడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈసారి వైరస్ వ్యాప్తికి కుంభమేళనే కారణం అవుతుందని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. అయితే వర్మ రోజుకో స్టైల్‌లో కరోనా కేసులపై ట్వీట్లు వేస్తున్నారు. లేటెస్ట్‌గా వచ్చే ఏడాదికి ఇక మనుషులే మిగలరు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. టీషర్ట్ ధరించిన ఓ అమ్మాయి ఫోటోని వర్మ ట్వీట్ చేశారు. ఆ ఫోటోలో అమ్మాయి టీషర్టుపై ‘2019లో నెగెటివ్ మనుషులని దూరం పెట్టాము. 2020లో పాజిటివ్ వ్యక్తులను దూరం పెట్టాము. 2021లో మనుషులనే దూరం పెట్టాల్సి వచ్చింది’ ని రాసి ఉంది. ఈ ఫోటోని షేర్ చేసిన వర్మ అసలు 2022లో మనుషులే ఉండకపోవచ్చు అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. ‘పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. వర్మ చెప్పిందే నిజం అవుతుంది’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ