Chandrababu Naidu: చంద్రబాబుకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెగ.. కుప్పంలో చేదు అనుభవం.. అభిమానుల నినాదాలు

పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతకు షాక్ ఇచ్చారు . చిత్తూరు జిల్లా శాంతిపురంలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించగా.. జూనియర్ ఎన్టీఆర్‌ని పార్టీలోకి ఆహ్వానించి.. కీలక బాధ్యతలు ఇవ్వాలంటూ ఆయన అభిమానులు నినాదాలు చేయడంతో చంద్రబాబు మౌనం వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వందలాది మంది కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్ ముందు జై ఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పాటు.. కుప్పంకి ఎన్టీఆర్‌ని తీసుకుని రావాలంటూ నినాదాలతో హోరెత్తించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. దీంతో పాటు చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనిపించడం విశేషం. రానున్న రోజుల్లో ఎన్టీఆర్ పార్టీలో చురుకుగా పాల్గొనే అవకాశం ఇవ్వాలనే డిమాండ్ అధినేత ముందుంచారు టీడీపీ కార్యకర్తలు. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కష్టకాలంలో ఎన్టీఆర్ సాయం కోరతారో.. లేక కొడుకు లోకేష్ బాబుతోనే ఎన్నికలకు వెళ్తారో వేచి చూడాల్సిందే.
Comments
Post a Comment