Vakeel Saab: పవన్ కళ్యాణ్ షూటింగ్ ఫినిష్.. పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన బోణీ కపూర్

రెండేళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత 'వకీల్‌ సాబ్' సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కంటే ముందే ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ నేటితో ఫినిష్ చేశారు పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటిస్తూ పవర్ త్వరలోనే చూడబోతున్నారంటూ చిత్ర నిర్మాత బోణీ కపూర్ ట్వీట్ చేశారు. ఈ మేరకు పవన్‌తో చిత్రయూనిట్ దిగిన ఫొటోలను షేర్ చేశారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'పింక్' రీమేక్‌గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ 'వకీల్ సాబ్' మూవీ రూపొందుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా సమర్పిస్తున్నారు. చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల హీరోయిన్లుగా నటించారు. శృతి హాసన్ ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపించనుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన వకీల్ సాబ్ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పాయి. నిజానికి రాబోయే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ.. అనుకోని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో ఈ సినిమా సంక్రాంతి నుంచి సమ్మర్ రేసులోకి మారిపోయింది. ఇకపోతే ఇప్పటికే ‘వకీల్ సాబ్’ టీజర్ రెడీ చేశారని, న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న ఈ టీజర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 100 కోట్లకు పైగానే జరిగిందని టాక్.


Comments

Popular posts from this blog

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

బాలయ్య గ్రేట్, క్యాస్ట్ ఫీలింగ్ లేదు.. మెగా హీరోల వల్ల కోట్లు నష్టపోయా.. చిరంజీవిని సినిమా అడగను: నిర్మాత సి. కళ్యాణ్