Krack: స్టార్ హీరో సినిమాలో కమెడియన్‌గా.. టిక్‌టాక్ దుర్గారావుకు బంపరాఫర్

సోషల్‌మీడియా యాప్ టిక్‌టాక్ ద్వారా ఎంతో మంది తమలోని టాలెంట్‌ను నిరూపించుకున్నారు. సినిమా పాటలకు స్పెప్పులు వేస్తూ, డైలాగులకు పేరడీ చేస్తే చాలామంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నారు. సామాన్యులను సైతం సెలబ్రెటీలను చేసేసింది టిక్‌టాక్. ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాకు చెందిన దుర్గారావు తన భార్యతో కలిసి టిక్‌టాక్ చేసిన వీడియోలు చాలా ఫేమస్ అయ్యాయి. ఆ టాలెంట్‌తోనే వారు పలు టీవీ షోల్లో సందడి చేశారు. ముఖ్యంగా ‘పలాస’ సినిమాలోని ‘మీ బావగారు వచ్చేటి వేళ’అనే పాటకు దుర్గారావు వేసిన స్టెప్పులు చాలా పేరు తీసుకొచ్చాయి. Also Read: తాజాగా అందిన సమాచారం ప్రకారం దుర్గారావుకు సినిమాల్లో బంపరాఫర్ దక్కినట్లు తెలుస్తోంది. మాస్ మహరాజ్ రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘’లో దుర్గారావు కనిపించనున్నాడట. దుర్గారావు టిక్‌టాక్ వీడియోలు చూసి ఇంప్రస్ అయిన గోపీచంద్.. అతడిని ఓ కామెడీ పాత్ర ఇచ్చాడట. తనకు దక్కిన ఈ అవకాశాన్ని దుర్గారావు ఎలా వినియోగించుకుంటాడో చూడాలి. ‘క్రాక్’ మూవీ సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి రానుంది. Also Read:
Comments
Post a Comment