మహేశ్‌ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చిన వార్నర్.. ఈ వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్‌ తెలుగువారికి సుపరిచితుడే. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తరపున మెరుపులు మెరిపించడంతో పాటు తెలుగు సినీ పాటలకు డ్యాన్సులు వేస్తూ అలరిస్తుంటాడు. ఆయన టాప్ హీరోల పాటలు, డైలాగులకు తన మేనరిజాన్ని అప్లై చేసి ప్రేక్షకులను తరుచూ అలరిస్తుంటాడు. గతంలో పాటలకు స్పెప్పులు వేసి అదరగొట్టిన వార్నర్ న్యూ ఇయ్ వేళ సూపర్‌స్టార్ ఫ్యాన్స్‌ మరో సర్‌ప్రైజ్ ఇచ్చాడు. మహేశ్‌బాబు 25వ సినిమాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహర్షి’ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలను సెలక్ట్ చేసుకొని రీఫేస్ యాప్ సహాయంతో వార్నర్ ఓ వీడియోను రూపొందించాడు. అందులో మహేశ్ ఫేస్‌కి బదులుగా తన ఫేస్‌ని యాడ్ చేశాడు. కొన్ని డైలాగులకు ఎక్స్‌ప్రెషన్లు కూడా ఇచ్చాడు. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో సూపర్‌స్టార్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ వీడియో నెటిజన్లతో పాటు మహేశ్‌ ఫ్యాన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటోంది.


Comments

Popular posts from this blog

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

బాలయ్య గ్రేట్, క్యాస్ట్ ఫీలింగ్ లేదు.. మెగా హీరోల వల్ల కోట్లు నష్టపోయా.. చిరంజీవిని సినిమా అడగను: నిర్మాత సి. కళ్యాణ్