నిర్మాతగా సోనూసూద్.. స్ఫూర్తి నింపే కథల కోసం వేట!

వెండితెరపై హీరోగా వెలిగిపోవాలని ఎన్నో ఆశలతో ముంబయిలో అడుగుపెట్టారు . అయితే హీరోలతో దెబ్బలు తినే విలన్ వేషాలే ఆయనకు స్వాగతం పలికాయి. అయినా నిరాశ పడకుండా బాలీవుడ్‌లోనే కాకుండా అనేక భాషల్లో విలన్ పాత్రలు వేస్తూ అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే సినిమాల్లో హీరో కాకపోయినా.. లాక్‌డౌన్ సమయంలో వేలాది మంది వలస కార్మికులు, నిరుపేదలకు ఆదుకుని నేషనల్ హీరో అంటూ అందరికీ ప్రశంసలు అందుకున్నారు. ఇన్నాళ్లూ ఆన్‌ స్క్రీన్‌పై కనిపించిన సోనూసూద్ నిర్మాతగా మారనున్నారట. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ‘నేను నిర్మాతగా మారుతున్నాను. ప్రజల్లో స్ఫూర్తి నింపే కథలు, నేను చేయాలనుకున్న స్క్రిప్ట్స్‌ కోసం అన్వేషిస్తున్నాను. అన్నీ కుదిరితే త్వరలోనే నిర్మాతగా మీ ముందుకొస్తా’ అని సోనూసూద్ అన్నారు. సోనూసూద్‌కి ప్రస్తుతం ప్రజల్లో ఉన్న క్రేజ్‌ని బట్టి ఆయనతో విలన్ వేషాలు వేయించేందుకు దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లోనూ నెగిటివ్ షేడ్స్ ఉండే ఆయన పాత్రకు కొన్ని మార్పులు చేశారట. చిరంజీవి సూచనల మేరకు దర్శకుడు ఆ మార్పులు చేసినట్లు ఇటీవలే సోనూసూద్ చెప్పుకొచ్చారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ