2021లో అందరికీ మంచి జరగాలని శ్రీవారిని వేడుకున్నా: రాజేంద్రప్రసాద్

కరోనా వైరస్ మనుషుల్లో ఎంతగానో మార్పులు తీసుకు వచ్చిందని, అద్భుతమైన పాఠాన్ని నేర్పించిందని అన్నారు సినీనటుడు . బుధవారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. శ్రీవారి సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ వల్ల ఆరోగ్య పద్ధతులు, అలవాట్లలో కూడా చాలా మార్పులు వచ్చాయని, కరోనా సమయంలో టీటీడీ అధికారులు కోవిడ్ నిబంధనలతో భక్తులకు దర్శనం కల్పించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. లాక్‌డౌన్ సమయంలో ఎంతో మంది ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని, 2021లో అయినా ప్రతి ఒక్కరూ అభివృద్ధిలోకి రావాలని శ్రీవారిని వేడుకున్నట్లు రాజేంద్రప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం తాను వరుస సినిమాలో బిజీగా ఉన్నానని రాజేంద్రప్రసాద్ తెలిపారు. గాలి సంపత్, ఎఫ్3, రౌడీ బేబీ, లవ్ ఎట్ 65 తదితర చిత్రాల్లో నటిస్తున్నట్లు వెల్లడించారు.


Comments

Popular posts from this blog

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

బాలయ్య గ్రేట్, క్యాస్ట్ ఫీలింగ్ లేదు.. మెగా హీరోల వల్ల కోట్లు నష్టపోయా.. చిరంజీవిని సినిమా అడగను: నిర్మాత సి. కళ్యాణ్