ముదిరిన వార్: నాగబాబుకు ప్రకాష్ రాజ్ అదిరిపోయే కౌంటర్.. గారు, అంటూనే!

ప్రముఖ సినీ నటులు ప్రకాష్ రాజ్‌, మెగా బ్రదర్‌ మధ్య మాటల యుద్ధానికి తెరలేచినట్టే కనిపిస్తోంది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి మద్దతు ప్రకటించడం తనకు నచ్చలేదని ప్రకాశ్‌రాజ్‌ అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాగే పవన్ కళ్యాణ్‌ను ఊసరవెల్లితో పోల్చారు. అయితే.. ప్రకాశ్‌ రాజ్‌ వ్యాఖ్యలపై పవన్‌ ‌సోదరుడు నాగబాబు ధీటుగా స్పందించారు. ‘‘మీకు భాజపా నచ్చకపోతే విమర్శించండి.. అంటూనే ఆ పార్టీ చేసే మంచిని కూడా హర్షించగలిగే మనసు మీకు లేదు’’ అంటూ కౌంటర్‌ ఇచ్చారు. మీడియా అడిగిందని ఒళ్లు పొంగి నీ పనికిమాలిన రాజకీయ డొల్లతనాన్ని బయటవేసుకోకు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు సత్తా చాటబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, నాగబాబు వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్‌ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ కౌంటర్ ఇచ్చారు. మాకు తెలుగు వచ్చు.. కానీ మీ భాష రాదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘గౌరవనీయులైన నాగబాబు గారికి, మీ తమ్ముడు మీద ఉన్న ప్రేమ నాకు అర్థం అయింది. నాకు దేశం మీద ఉన్న ప్రేమని మీరు అర్థం చేసుకోండి. నాకు తెలుగు భాష వచ్చు కానీ మీ భాష రాదు.’’ అని ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ ట్వీట్‌కు జనసైనికులు యథావిధిగా విమర్శలు సంధిస్తున్నారు. అయితే దీనిపై నాగబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. నాగబాబుకు ప్రకాష్ రాజ్ ఇచ్చిన కౌంటర్‌పై మెగా ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. ప్రకాష్ రాజ్‌పై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. కేవలం బీజేపీపై ద్వేషంతో మీరే ఊసరవెల్లిగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు ప్రకాష్ రాజ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. నాగబాబుకు మీ అంత స్థాయి లేదంటూ యాంటీ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ