కమెడియన్ శంకర్ మేల్కొటే.. ఓ కంపెనీకి సీఈఓ... సినిమాల్లోనూ అవే పాత్రలు

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది హాస్యనటులున్నా కొందరు మాత్రం కలకాలం గుర్తుండిపోతారు. అలాంటి వారిలో ఒకరు. ప్రతి సినిమాలోనూ పిల్లి గడ్డంతో బ్లాక్‌ సూట్‌లోనే దర్శనమివ్వడం ఆయన ప్రత్యేకత. మేల్కొటే సినీ రంగ ప్రవేశం చాలా విచిత్రంగా జరిగిందట. ఉషాకిరణ్ మూవీస్ అధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థలో మేల్కొటే పనిచేసేవారు. ఆ సంస్థ కోసం తీసిన ప్రకటనలో ఆయన తొలిసారి నటించారు. కొద్దిరోజుల తర్వాత ఉషాకిరన్ మూవీస్ నిర్మించిన ‘శ్రీవారికి ప్రేమలేఖ’ సినిమాలో హీరో బాస్ పాత్ర కోసం నటుడిని అన్వేషిస్తుండగా మేల్కొటేని పిలిచారట రామోజీరావు. Also Read: అక్కడే ఉన్న గేయ రచయిన వేటూరి సుందర రామ్మూర్తి మేల్కొటేని చూసి ఈయనకు స్క్రీన్ టెస్ట్ అవసరం లేదని రామోజీరావుకు చెప్పారట. ఆ సినిమాలో తెలుగు రాని బాస్‌ పాత్రలో మేల్కొటే ప్రేక్షకులను అలరించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 180 చిత్రాల్లో ఆయన నటించారు. ఒకట్రెండు సినిమాల్లో తప్ప అన్ని సినిమాల్లోనూ బాస్‌గానే కనిపించినా ప్రేక్షకుల ఎప్పుడూ బోర్ కొట్టలేదు. సినిమాల్లో ఏదైనా కామెడీ బాస్ పాత్ర ఉందంటే ఇప్పటికీ దర్శక నిర్మాత ఫస్ట్ ఛాయిస్ ఆయనే. అయితే సినిమాల్లో చిన్నచిన్న వేషాలు చేస్తున్నంత మాత్రాన మేల్కొటే బ్యాక్‌గ్రౌండ్ తక్కువేమోనని అనుకోవద్దు. ఆయన పర్సనల్ లైఫ్ గురించి చాలామందికి తెలియదు. నిజానికి ఆయన హైదరాబాద్‌లోని ఓ మార్కెటింగ్ కంపెనీకి సీఈవోగా పనిచేశారు. అంతేకాదు ఆయన అల్లుడు ఎవరో కాదు.. మాజీ రంజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ జనరల్ మేనేజర్‌ ఎంపీ శ్రీధర్. మేల్కొటే కూతురు రమాని శ్రీధర్ వివాహం చేసుకున్నారు. మేల్కొటే కొడుకు అమెరికాలో ఓ సంస్థలో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల్లో వేసే పాత్రల్లాగానే మేల్కొటే నిజజీవితంలోనూ బాస్‌గానే పనిచేయడం విశేషం. Also Read:


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ