అమ్మ మాటలు కదిలించాయి.. అందుకే నటుడినయ్యా: రావు రమేష్

తన విలనిజంతో ఎందరో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు . తండ్రిని మించిన కొడుకుగా ఇప్పుడు అంతకంటే ఎక్కువగానే ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. విలనిజంతో పాటు కామెడీ, సెంటిమెంట్ పాత్రలను అద్భుతంగా పండిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘సీమసింహం’తో టాలీవుడ్‌కి పరిచయమైన రమేష్‌కు... ‘కొత్త బంగారు లోకం’, ‘గమ్యం’ సినిమాలు బ్రేక్ ఇచ్చాయి. Also Read: అయితే రావు రమేష్‌కు అసలు నటన అంటే ఆసక్తి లేదంటే నమ్మగలమా. అవును ఇండస్ట్రీకి రాకముందు రమేష్ దర్శకుడు అవుదామనుకున్నారట. ఇదే విషయాన్ని తల్లికి చెప్పగా.. ‘డైరెక్టర్ కావాలంటే లెన్స్ తెలిస్తే సరిపోదు.. 24 విభాగాలపైనా పట్టు ఉండాలి, జీవితం తెలియాలి. ముళ్ల బాట దాటుకుని వెళ్లిన తర్వాతే వెలుగు కనిపిస్తుంది. ముందు నటుడిగా నిరూపించుకో’ అని చెప్పారంట. తల్లి చెప్పిన మాటలతో మనసు మర్చుకున్న రావు రమేష్ డైరెక్షన్ ఆలోచనను పక్కన పెట్టి నటుడయ్యారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పారు. Also Read:
Comments
Post a Comment