‘ఎనిమీ’గా వస్తోన్న విశాల్, ఆర్య.. టైటిల్‌కు భారీ స్పందన

తమిళ హీరోలు , ఆర్య.. ఇద్దరూ ఇద్దరే. వైవిధ్యమైన కమర్షియల్ సినిమాలు చేస్తూ తమకంటూ ఒక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న హీరోలు వీరు. గతంలో బాలా రూపొందించిన ‘వాడు-వీడు’ సినిమాలో విశాల్, ఆర్య కలిసి నటించి బాక్సాఫీస్‌ని షేక్ చేశారు. ఆ సినిమా అప్పట్లో హాట్ టాపిక్. వీరిద్దరూ పక్కా పల్లెటూరి మొరటోళ్లుగా నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఇప్పుడు మరోసారి విశాల్, ఆర్య కలిసి నటిస్తున్నారు. ఈ మూవీ ఇటీవల హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి ‘ఎనిమీ’ అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ టైటిల్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ట్విట్టర్‌లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఇది హీరో విశాల్‌కు 30వ చిత్రం కాగా, ఆర్యకు 32వ సినిమా. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో నటించిన మృణాళిని రవి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. Also Read: ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆర్.డి.రాజశేఖర్ ఛాయాగ్రహణం అందిస్తుండగా, ఎస్.తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళంతో పాటు మరికొన్ని భాషలలో ఈ చిత్రం విడుదలకానుంది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది చిత్ర యూనిట్. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ టి.రామలింగం, ఎడిటర్ రేమండ్ డెరిక్ క్రాస్టా, యాక్షన్ రవివర్మ.
Comments
Post a Comment