లవ్ ఫెయిల్యూర్ అయితే ఆ బాధేంటో నాకు తెలుసు: రేణూ దేశాయ్

ప్రేమలో విఫలమైతే తట్టుకోవడం కష్టమని, ఆ బాధేంటో తనకు తెలుసని అన్నారు సినీనటి . అయితే ప్రేమలో విఫలమైనంత మాత్రాన ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. చాలా రోజుల తర్వాత ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన రేణు.. అభిమానులతో ముచ్చటించారు. నెటిజన్లు, అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చారు. జీవితం, ప్రాణం కంటే ఎవరూ ఎక్కువ కాదని, ప్రేమలో ఫెయిల్ అయితే కలిగే బాధ తట్టుకోవడం కష్టమని రేణూ దేశాయ్ అన్నారు. ప్రేమించే మనిషి పక్కన లేదని, మనల్ని మోసం చేశాడన్న ఆలోచనలే చాలా కష్టంగా ఉంటాయని, కానీ ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం మాత్రం సరైన నిర్ణయం కాదన్నారు. కౌన్సిలింగ్ తీసుకుంటూనే కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్‌తో ఎక్కువ సమయం గడిపి మళ్లీ సాధారణ జీవితంలోకి అడుగుపెట్టొచ్చని చెప్పారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనకు ఒకేలా స్పందించాలని, బాధ కలిగితే ఏడవకూడదని, అలాగే సంతోషం కలిగినప్పుడు పొంగిపోకూడదని రేణు చెప్పారు ప్రస్తుతం తాను ‘ఆద్య’ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నానని రేణు దేశాయ్ తెలిపారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కే ఈ వెబ్ సిరీస్‌లో తాను సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవోగా కనిపించనున్నట్లు వెల్లడించారు. రైతుల సమస్యలపై తానొక సినిమా తెరకెక్కిస్తున్నానని, దానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయన్నారు. వచ్చే వేసవిలో షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. ‘ఆద్య’తో పాటు మరో కథలోనూ తాను నటిస్తున్నట్లు రేణూ దేశాయ్ వెల్లడించారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ