Charmy Kaur: నా కనురెప్ప పూరీ జగన్నాథ్‌! లవ్ యూ.. మాటిస్తున్నానంటూ ఓపెన్‌గా చెప్పేసిన ఛార్మి

ఒకప్పుడు హీరోయిన్‌గా గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఓ ఊపు ఊపేసిన ఛార్మింగ్ బ్యూటీ ఛార్మి.. ప్రస్తుతం నిర్మాతగా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించి ఈ బ్యానర్ మేనేజ్‌మెంట్ బాధ్యతలను పూర్తిగా భుజాలపై వేసుకున్న ఆమె అన్నీ తానై చూసుకుంటూ వరుస సినిమాలు నిర్మిస్తోంది. దీంతో పూరి- చాలా దగ్గరయ్యారు. ఎప్పుడు.. ఎక్కడ చూసినా ఈ జోడీ కలిసే కనిపిస్తోంది. పైగా పలుసార్లు ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, అభిమానాలు కూడా వ్యక్తపరిచారు. ఈ చొరవతోనే నేడు (సెప్టెంబర్ 28) పూరి జగన్నాథ్ సంబర్భంగా లవ్ యూ అంటూ స్పెషల్ విషెస్ చెప్పింది ఛార్మి. తనకు పూరి కనురెప్ప లాంటి వారని పేర్కొంది. ''ప్రాణ స్నేహితుడు, ఎప్పుడూ నా క్షేమం గురించి ఆలోచించే వ్యక్తి, బెస్ట్ బిజినెస్ పార్ట్నర్ అయిన గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. లవ్ యూ. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. మీరు గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నా. మున్ముందు ఇంకా దున్నేద్దాం'' అని ఛార్మి ట్వీట్ చేసింది. ఇటీవలే ఛార్మి- పూరి కలిసి సంయుక్తంగా నిర్మించిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీ ఇద్దరి భవిష్యత్‌నే మార్చేసింది. కెరీర్‌లో పిల్లర్ బోన్‌గా నిలిచి తిరిగి ఇద్దరినీ ట్రాక్ ఎక్కించింది. దీంతో అదే ఫామ్ కంటిన్యూ చేస్తూ పార్ట్‌నర్‌షిప్ కొనసాగిస్తున్న వీళ్ళు.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా 'ఫైటర్' మూవీ చేస్తున్నారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పూరి, ఛార్మి, కరణ్‌ జోహార్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Also Read: ఇకపోతే పూరి జగన్నాథ్‌కి మహేష్ బాబు స్పెషల్‌గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం విశేషం. అలాగే పూరి గురువు రామ్ గోపాల్ వర్మ, ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు పూరిని అభిమానించే అశేష అభిమానవర్గం ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతోంది.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ