వాళ్లను కాపాడటానికి రక్తదానం ఒక్కటే పరిష్కారం : బాలకృష్ణ

వైద్య రంగం ఎంతగా అభివృద్ధి చెందినా కృత్రిమంగా రక్తం తయారు చేయడం కుదరదని అన్నారు హీరో, హిందూపురం ఎమ్మెల్యే . అందువల్లే అందరూ రక్తదానం చేయాలని సూచించారు. ముఖ్యంగా వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఓ వీడియోను ఆయన విడుదల చేశారు. Also Read: ప్రస్తుతం దేశంలో సంవత్సరానికి 10-12వేల మంది తలసేమియా వ్యాధితో జన్మిస్తున్నారని, వారికి రక్తాన్ని ఎక్కించాల్సిన అవసరం ఉందన్నారు. వీరి కోసం కృత్రిమ రక్తాన్ని తయారు చేయలేం కాబట్టి.. రక్తదానం ఒక్కటే పరిష్కారమని తెలిపారు. ఎదుటివారికి రక్తదానం, ప్లాస్మా దానం చేయడం వల్ల మనకెలాంటి దుష్పరిణామాలు ఉండవని చెప్పారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా తలసేమియా బాధితుల కోసం తెలంగాణా తెలుగు యువత, ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్టు బాలకృష్ణ తెలిపారు. నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ