డ్రగ్స్ కేసులో ఇద్దరు హీరోయిన్లకు షాక్... అప్పటివరకు జైల్లోనే

శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో హీరోయిన్లు , సంజనా గల్రానీలకు కోర్టు మరోసారి షాకిచ్చింది. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న వీరిద్దరి బెయిల్ పిటిషన్‌ను మరోసారి తిరస్కరించింది. దీంతో కొద్దిరోజులుగా జైల్లో ఉంటూ బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టాలని ఎదురుచూస్తున్న వారిపై ఆశలపై కోర్టు నీళ్లు చల్లింది. కర్ణాటకలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం సినీ పరిశ్రమనే కాకుండా, బుల్లితెరను కూడా తాకింది. కన్నడ టీవీ యాంకర్ అనుశ్రీని మంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు.
సీసీబీ పోలీసుల విచారణలో మరికొంత మంది సెలబ్రెటీల పేర్లు వెలుగులోకి వస్తుండటంతో కన్నడ సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ సేకరించి వాటిని ఫైవ్‌స్టార్ హోటళ్లు, క్లబ్బులు, పబ్బుల్లో విక్రయించేదని ఆరోపణలున్నాయి. డ్రగ్స్ కేసులో రాగిణి ద్వివేదికి సెప్టెంబర్ 3న సమన్లు పంపిన సీసీబీ అధికారులు మరుసటి రోజే ఆమె ఇంట్లో సోదాలు జరిపారు. విచారణకు సహకరించడం లేదంటూ అదే రోజు ఆమెను అరెస్ట్ చేశారు. 8వ తేదీన సంజన ఇంట్లో కూడా సోదాలు జరిపి ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు.
Comments
Post a Comment