‘కరోనా వైరస్’ని రంగంలోకి దించిన ఆర్జీవీ.. రిలీజ్ అప్పుడేనట

లాక్‌డౌన్ కారణంగా ఆరు నెలలుగా మూతపడిన సినిమా థియేటర్లు తెరుచుకునే సమయం ఆసన్నమైంది. అన్‌లాక్ 5.0లో భాగంగా అక్టోబర్ 15 తర్వాత థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో పలువురు నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ కోవలోనే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ లాక్‌డౌన్ తర్వాత విడుదలయ్యే తొలి సినిమా తనదేనని ప్రకటించారు. Also Read: లాక్‌డౌన్ సమయంలో ఏటీటీల ద్వారా పలు సినిమాలను విడుదల చేసిన వర్మ ప్రస్తుతం `కరోనా వైరస్` పేరుతో ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. దీనికి అగస్త్య మంజు దర్శకత్వం వహించారు. అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో `కరోనా వైరస్`ను వర్మ విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు. `మొత్తానికి అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెరుచుకుంటున్నాయి. లాక్‌డౌన్ తర్వాత విడుదలవుతున్న తొలి సినిమాగా `కరోనా వైరస్` నిలుస్తుందని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది` అంటూ రామ్‌గోపాల్ వర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు. Also Read:


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ