నామినేషన్ హీట్.. దివి టార్గెట్ అభిజిత్.. నిన్నే నామినేట్ చేస్తా ఇది క్లియర్

ఆదివారం నాడు దేవి ఎలిమినేషన్‌తో చాలా మంది ఇంటి సభ్యులు షాక్‌లోనే ఉండిపోయారు. ఇక సోమవారం నాడు నాలుగో వారం నామినేషన్ హీట్ ఉండటంతో ఈవారంలో ఎవరు నామినేట్ అవుతారు?? ఇంటి సభ్యుల మధ్య రచ్చ ఏ విధంగా ఉండబోతుందనే ఆసక్తితో సోమవారం నాటి ఎపిసోడ్ ప్రారంభమైంది. సోమవారం నాటి 23 వ ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే.. గోంగూర తోట కాడ కాపుకాశా.. అనే మాస్ బీట్‌ సాంగ్‌కి ఉదయాన్నే స్టెప్పులు వేశారు కంటెస్టెంట్లు. మార్నింగ్ మస్తీలో భాగంగా.. స్వాతి దీక్షిత్ నవరసాలు నేర్పించాలని ఆదేశించడంతో.. నవరసాల్లో భాగంగా మొదట శృంగార రసాన్ని అదీ కూడా అభిజిత్‌తోనే పంచుకుంది స్వాతి. ఆ తరువాత అన్ని రసాలను దట్టించికొట్టింది స్వాతి. కోపం రసాన్ని పిండటానికి రంగంలోకి దిగిన లాస్య-నోయల్‌లు ఆస్కార్ రేంజ్ పెర్ఫామెన్స్ ఇచ్చేశారు. ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకుని ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. ఇదే సీన్‌ని ప్రోమోలో జనాల్ని పిచ్చోళ్లని చేశాడు బిగ్ బాస్. ఇక మొనాల్-మెహబూబ్‌లు నామినేషన్స్ విషయంలో చర్చించి.. అభిని నామినేట్ చేయడానికి గట్టి రీజన్ ఉందని మాట్లాడుకున్నారు. అరియానా-అవినాష్‌లు వరసలు రొమాన్స్, కెమిస్ట్రీపై ఫన్నీ చర్చలు జరిపారు. ఇక కుమార్ సాయిని లూజ్ అనడంపై అభితో చర్చించింది దివి. నువ్ ఒక్కోసారి ఒక్కోలా ఉంటావు.. సడెన్‌గా సీరియస్ అయిపోతావ్.. అని అనడంతో ‘నేను నీకు అర్థం కావాల్సిన అవసరం లేదు.. నేనే ఏంటో నాకు తెలుసు.. నిన్ను నామినేట్ చేసినా ఆశ్చపోవాల్సిన పనిలేదు’ అని చెప్పాడు అభి. దీంతో నువ్ నాకు అర్థం కావాల్సిన అవసరమే లేదు.. నువ్వే కాదు.. నేను కూడా నిన్ను నామినేట్ చేయడానికి రెడీగా ఉన్నా.. ఇది క్లియర్’ అని ట్విస్ట్ ఇచ్చింది దివి.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ