అమ్మాయిలు చాలా క్లియర్.. వాళ్లనే ప్రేమిస్తారు.. దమ్ముంటే నీ సత్తా చూపించు: పూరి జగన్నాథ్

మగాడు అన్నాక పనిచేయాలని, సంపాదించాలని, సత్తా చాటాలని అంటున్నారు ప్రముఖ దర్శకుడు . పూరి మ్యూజింగ్స్ ద్వారా రోజుకో అంశంపై మాట్లాడుతున్న పూరి జగన్నాథ్.. మంగళవారం మగాడు ఎలా ఉండాలి అనే అంశపై మాట్లాడారు. మగాడు ఎలా ఉంటే అమ్మాయిలు ఇష్టపడతారో చెప్పారు. మగాడికి ఎలాంటి లక్ష్యం ఉండాలో వెల్లడించారు. ప్రతి మగాడు తన బ్యాంక్ బ్యాలెన్స్ అతడి మొబైల్ నంబర్ అంత అయ్యేలా కష్టపడాలని అన్నారు. ఈ క్రమంలో తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పూరి. ‘‘అందమైన ఆడపిల్లలను చూస్తే ఎవరికైనా ఇష్టమే. అందుకే అందరూ వాళ్లతో ప్రేమలో పడిపోతుంటారు. కానీ, మగాళ్లను మాత్రం చూడగానే ఎవరూ లవ్ చేయరు. ఎవరూ ఎత్తుకోరు, ఎవరూ ముద్దుపెట్టుకోరు. సో స్వీట్ అని మన బుగ్గ పట్టుకుని ఎవరూ గిల్లరు. ఎందుకు.. అంటే సమాధానం లేదు. మగాడు ఏదైనా చేయాలి, ఏదైనా తేవాలి, ఏదైనా ఇవ్వాలి లేదా ఏమైనా అయిపోవాలి. ఏమీ చేయకుండా మనల్ని ఎవ్వరూ ఎత్తుకోరు. ముద్దు పెట్టుకోరు. అందుకే ఏదైనా చేయండి. ఖాళీగా ఉండొద్దు. నువ్వు ఎంత అందగాడివైనా ఏ అమ్మాయి నీ మొహం చూడదు. నీకు సిక్స్ ప్యాక్ ఉన్నా నీ ఫోన్ నంబర్ అడగదు. అమ్మాయిలు చాలా క్లియర్‌గా ఉంటారు. సత్తా ఉన్నవాడినే ప్రేమిస్తారు. దమ్ముంటే నీ సత్తా ఏంటో చూపించు. ఒక సామెత ఉంది.. ఎందుకూ పనికిరాని మొగుడు మంచం నిండా ఉన్నాడని. ఆరున్నర అడుగులు ఉంటాడు. ఆడు పడుకుంటే కాళ్లు మంచం దాటి బయటికి కూడా వస్తుంటాయి. కానీ, ఏమీ చేయడు. ఎందుకు మరి.. వేస్ట్ కదా. అందుకే మగాడన్నాక కష్టపడాలి’’ అని పూరి జగన్నాథ్ అన్నారు. Also Read: మన మొబైల్ నంబర్ మన బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయేలా టార్గెట్ పెట్టుకోవాలని పూరి సలహా ఇచ్చారు. అనుకుంటే అన్నీ అవుతాయన్నారు. ‘‘నేను మొదటిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఓ రాత్రి అన్నపూర్ణ స్టూడియో పైనుండి హైదరాబాద్‌ను చూశాను. సిటీ మొత్తం ఎన్నో లక్షల ఇళ్లు. అన్ని ఇళ్లలో లైట్లు వెలుగుతున్నాయి. నగరం మొత్తం దీపావళిలా ఉంది. ఎక్కడ చూసినా ఇళ్లే. ఇంత పెద్ద సిటీలో ఇల్లు కట్టినవాళ్లందరూ బాగా తెలియనవాళ్లా అని నన్ను నేను అడిగాను. లోపల నుంచి కాదు అని ఆన్సర్ వచ్చింది. అంటే, యావరేజ్ మైండ్స్, బిలో యావరేజ్ మైండ్స్ ఉన్నవాళ్లు కూడా ఇక్కడ ఇల్లు కట్టుకోగలిగారు. అలా అయితే మనం ఒకరోజు కట్టేద్దాంలే అనుకొని కొండ దిగి కృష్ణానగర్ నడుచుకుంటూ పోయా’’ అని పూరి చెప్పుకొచ్చారు. నేడు వేల వేల కోట్లు సంపాదించిన వాళ్లందరూ పుట్టికతోనే జీనియస్‌లు కాదని, కానీ లైఫ్‌లో ఎంతో కష్టపడ్డారని పూరి అన్నారు. వాళ్లలానే మనమూ కష్టపడదామని ఏదో ఒక రోజు మన మొబైల్ నంబర్‌ని మన బ్యాంక్ బ్యాలెన్స్ చేసేద్దామని పూరి సలహా ఇచ్చారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ