53 ఏళ్ల వయసులో నటి హేమ కీలక నిర్ణయం.. ఆమెను అభినందిచాల్సిందే!

క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశారు. కొన్ని వందల చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు పోషించారామె. బిగ్ బాస్ షోలో పాల్గొనడం ద్వారా ప్రస్తుతం యూత్‌లోనూ మంచి పాపులారిటీ సంపాదించారు. ఇన్నాళ్లు సినిమాలతో బిజీగా ఉన్న హేమ.. ఇప్పుడు చదువుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే, దూరవిద్యలో డిగ్రీ పూర్తిచేసేందుకు ఆమె అర్హత పరీక్ష రాశారు. నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఇటీవల జరిగిన అర్హత పరీక్షకు ఆమె హాజరయ్యారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం ద్వారా హేమ తన డిగ్రీని పూర్తి చేయనున్నారు. పరీక్ష ఫలితాలు ఆన్‌లైన్‌లో పెడతామని యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.ధర్మానాయక్‌ తెలిపారు. అర్హత సాధించిన అభ్యర్థులు వెంటనే తమకు నచ్చిన అధ్యయన కేంద్రంలో ఆన్‌లైన్‌ ద్వారా అడ్మిషన్‌ పొందవచ్చని తెలిపారు. అంటే, హేమ త్వరలోనే డిగ్రీలో చేరతారన్నమాట. 53 ఏళ్ల వయసులోనూ చదువు కోసం ఆరాటపడుతోన్న హేమను అభినందించాల్సిందే. ప్రస్తుతం హేమ రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘కొండాపురం’ సినిమా చిత్రీకరణలో ఉన్నారు. అందుకే పరీక్ష కేంద్రంగా నల్గొండ ఎంచుకొన్నట్లు ఆమె మీడియాతో మాట్లాడుతూ అన్నారు. గత రెండేళ్లుగా డిగ్రీ ప్రవేశం కోసం అర్హత పరీక్ష రాసేందుకు ప్రయత్నిస్తున్నా వీలు కాలేదన్నారు. డిగ్రీతోపాటు కంప్యూటర్‌ కోర్సులు నేర్చుకోనున్నట్లు ఆమె తెలిపారు. డిగ్రీ పూర్తిచేయడం తన కల అని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు చెందిన హేమ చిన్నతనంలోనే చదువును పక్కనబెట్టారు. ఆ తరవాత సినిమాల్లోకి వచ్చేశారు. అందుకే, ఇప్పుడు దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తిచేయాలని నిర్ణయించుకున్నారు. Also Read:


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ