ఆ ఘనతకు 21ఏళ్లు.. జ్ఞాపకాల్లో మునిగి తేలుతున్న త్రిష

తమిళ, తెలుగు భాషల్లో సుమారు దశాబ్దం పాటు అగ్ర హీరోయిన్‌గా కొనసాగింది చెన్నై బ్యూటీ త్రిష. రెండు భాషల్లోనూ స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలతోనూ ఆడిపాడింది. అయితే సినిమాల్లోకి రాకముందు ‘మిస్ చెన్నై’ ఎంపికైన సంగతి అందరికీ తెలిసిందే. సరిగ్గా 21ఏళ్ల క్రితం అంటే 30-09-1999వ తేదీన ఆమె ఈ టైటిల్ గెలుచుకుంది. Also Read: ఆ సందర్భాన్ని త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా గుర్తుచేసుకుంది. `మిస్ చెన్నై`గా నిలిచినప్పటి ఫొటోను షేర్ చేసింది. ‘30-09-1999.. ఆ రోజు నా జీవితం మారిపోయింది. ‘మిస్ చెన్నై 1999’ అంటూ కామెంట్ చేసింది. దీంతో నెటిజన్లు త్రిషను అభినందనలతో ముంచెత్తుతున్నారు. Also Read:
Comments
Post a Comment