సుధీర్ కంటతడి.. తింటానికి తిండిలేక సింక్ నీళ్లు తాగి.. పడిన కష్టం మొత్తం కళ్లకు కట్టారు

సుడిగాలి సుధీర్.. బుల్లితెరపై ఇతనో సంచలనం. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, తమిళనాడులో కూడా సుధీర్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటమే కాదు.. ఇతని పేరుని పచ్చబొట్లు వేసుకోవడం.. ఇతనిపై స్పెషల్ థీంగ్ సాంగ్స్ రూపొందిస్తున్నారు అంటే మనోడి క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక తెలుగులో అయితే సుధీర్‌కి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎంతలా అంటే.. పొరపాటున స్కిట్‌లో సుధీర్‌పై ఎవరైనా పంచ్‌లు వేసినా.. తక్కువ చేసినా సుధీర్ ఫ్యాన్స్ ఆ పంచ్ వేసిన వాళ్ల తాట తీసేంతగా. ఇటీవల ఇక ఈవెంట్‌లో బిగ్ బాస్ రాహుల్ సిప్లిగంజ్ స్కిట్‌లో భాగంగా సుధీర్‌ని హౌలే, ఫాల్త్ అన్నందుకు రాహుల్ సిప్లిగంజ్‌ని ఓ రేంజ్‌లో ఏకిపారేశారు. జబర్దస్త్‌లో చాలా మంది కమెడియన్స్ ఉన్నప్పటికీ సుధీర్ చేసే కామెడీలో ఇనోసెన్స్‌ ఉండటం వల్ల చాలామంది మహిళా ప్రేక్షకులకు కూడా సుధీర్ అంటే ఇష్టం. విచిత్రం ఏంటంటే.. సుధీర్‌ని చేసే 90 శాతం స్కిట్స్‌లలో అతన్ని అమ్మాయిల పిచ్చోడిగా.. మహా కామ పిశాచిగా చూపిస్తుంటారు. అయినప్పటికీ కూడా జబర్దస్త్‌లోని ఇతర కమెడియన్ల మాదిరిగా సుధీర్ తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేసుకునేలా వ్యాఖ్యలు కాని కామెంట్స్ చేయకుండా వివాదాలకు దూరంగానే ఉంటాయి. అయితే బుల్లితెరపై సంచలన నటుడిగా పేరు సంపాదించిన సుధీర్.. ఈ స్థాయికి రావడానికి చాలానే కష్టపడ్డాడు. తండ్రి మరణంతో కుటుంబ భారం సుధీర్‌పై పడటంతో పదేళ్ల క్రితం కేవలం 8 వేల జీతానికి రామోజీఫిల్మ్ సిటీలో ఉద్యోగంలో చేరిన సుధీర్.. ఏదో సాధించాలన్న కసితే ఆ ఉద్యోగం మానేసి సింగిల్ రూంలో ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటూ ఆకలి బాధల్ని చూశాడు. తినడానికి తిండిలేక పెరుగు పేకెట్, రూ.1 ప్రియా పచ్చడితో కడుపు నింపుకున్న రోజులు చాలానే ఉన్నాయని చెప్తుంటాడు సుధీర్. కనీసం తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితుల్లో సింక్‌లో పైపులో వచ్చే నీళ్లను తాగిన సందర్భాలు సుధీర్ జీవితంలో ఉన్నాయి. రెండున్నరేళ్ల పాటు ఆకలి బాధల్ని భరించిన సుధీర్.. తన తల్లి తనని నటుడిగా చూడాలని కోరుకునేదని ఆ కోరిక కోసం తన కష్టాన్ని ఆపలేదని చెప్తుంటాడు సుధీర్. కాని పదేళ్లు తిరిగే సరికి బుల్లితెరపై పెద్ద స్టార్.. వెండితెర హీరో. నెలకు లక్షల్లో సంపాదన. సుధీర్ గతం తెలిస్తే కళ్లు చెమ్మగిల్లకుండా ఉండవు.. కాని అదే గతాన్ని సుధీర్ కళ్ల ముందుంచితే ఆ ఉద్విగ్న క్షణాలు గుండెల్ని బరువెక్కిస్తుంటాయి. తాజాగా ఢీ షోలో అదే జరిగింది. సుధీర్ గతానికి సంబంధించి అతను ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొని ఇక్కడికి వచ్చాడు? స్టార్ ఎలా అయ్యాడనే కాన్సెప్ట్‌లో సాంగ్ రూపొందించారు. ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా.. తన గతం తాలూకా జ్ఞాపకాలు, పడిన కష్టం కళ్ల ముందుంచడంతో ఏడ్చేశాడు సుధీర్. సుధీర్‌తో పాటు జడ్జీలు, అలాగే రష్మి కూడా సుధీర్‌ని పట్టుకని గట్టిగా ఏడ్చేసింది. సుధీర్ హార్డ్ వర్క్.. అతని జర్నీ చాలా పెయిన్ ఫుల్ అంటూ రష్మి ఏడుస్తూ చెప్పిన మాటలు కళ్లు చెమ్మగిల్లేలా చేశాయి.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ