‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్.. డేట్ లీక్ చేసిన తమన్!

పవర్ స్టార్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. హిందీ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా వస్తోన్న ‘వకీల్ సాబ్’ చిత్రం ఈపాటికే థియేటర్లలోకి రావాల్సింది. కాకపోతే కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా తాత్కాలికంగా వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, పాట విడుదలయ్యాయి. వీటికి అభిమానుల నుంచే కాకుండా సినీ ప్రేమికుల నుంచి విశేష స్పందన వచ్చింది. వీటి తరవాత అప్‌డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వాళ్ల ఎదురుచూపులకు తెరపడబోతోందని సమాచారం. Also Read: ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం బుధవారం ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్‌ను విడుదల చేస్తున్నారు. ఈరోజు సంగీత దర్శకుడు తమన్ చేసిన ట్వీట్ కూడా ఈ రూమర్‌కు ఊతమిస్తోంది. ‘‘WED - NES - DAY !!’’ అని తమన్ శుక్రవారం ట్వీట్ చేశారు. ఇది ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్ కోసం చేసిన ట్వీటేనని టాక్. ఈ మోషన్ పోస్టర్ ఫ్యాన్స్‌కు ఒక ట్రీట్ కాబోతోందని అంటున్నారు. ఈ విషయం ఫ్యాన్స్‌కు కూడా అర్థమైపోయినట్టుంది. అందుకే తమన్ ట్వీట్ కింద ‘‘అన్న.. బీజీఎం అదిరిపోవాలి’’ అని కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే, సుమారు రెండేళ్లపాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్.. మొత్తం మీద మళ్లీ ముఖానికి రంగు వేసుకున్నారు. ‘వకీల్ సాబ్’తో మళ్లీ తెరపై కనిపించనున్నారు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిజానికి ఈ చిత్రం మే నెలలో విడుదలకావాల్సి ఉంది. కానీ, కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో తాత్కాలికంగా ఆగింది. థియేటర్లు తెరుచుకుని పరిస్థితి చక్కబడితే అప్పుడు విడుదల తేదీని ప్రకటిస్తారు. హిందీలో అమితాబ్ బచ్చన్ చేసిన లాయర్ పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ