యాంకర్ ప్రదీప్‌కి 139 మంది రేప్ కేసులో ఎలాంటి సంబంధం లేదు.. కుట్ర కోణాన్ని బయటపెట్టిన కృష్ణమాదిగ

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మిర్యాల గూడ మహిళ 139 మంది రేపు కేసు ఘటనపై సంచలన విషయాలను బయటపెట్టారు MRPS అధ్యక్షుడు మంద . అసలు ఆ మహిళ వెనుకు ఉన్నది ఎవరు? ఎందుకు ప్రముఖ .. ఇతర సెలబ్రిటీల పేర్లను ప్రస్తావించింది అన్న విషయాలపై మీడియాతో మాట్లాడారు కృష్ణమాదిగ. ఆయన మాట్లాడుతూ.. ఆ మహిళ తనపై 139 మంది రేప్ చేశారని చేస్తున్న ఆరోపణల్లో దాదాపు 40 శాతం మందికి అసలు ఈ కేసులో సంబంధమే లేదు. ఈ 139 మందిపై కేసులు పెట్టించి.. ఆ కేసుల ద్వారా వాళ్లను వేధించి ఆర్థిక లబ్ధి పొందడం కోసం.. రాజశేఖర్ రెడ్డి అలియాస్ డాలర్ బాయ్ అనే వ్యక్తి కుట్ర పన్నారు. అంతేకాదు ఈ అమ్మాయిని తన కంట్రోల్‌లో పెట్టుకుని చాలా సార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని స్పష్టంగా రుజువు అవుతోంది. ఈ కేసులో మొదటి కారకుడు మీసాల సుమన్. ఈ 139 మందిపై కేసుపెట్టడానికి కారణం డాలర్ భాయ్. ఆ మహిళను ఇతను చాలా సార్లు అత్యాచారం చేశాడు. ఆయన చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి దాని ద్వారా ఆర్థిక లబ్ధిపొందడం కోసం కుట్ర పన్నాడు. ఈ అమ్మాయికి సంబంధించిన విషయాలు మొత్తం అతనికి తెలుసు కాబట్టి.. కొన్ని ఫొటోలు వీడియోలు ఇతరులతో ఉన్నవి అతని దగ్గర ఉన్నాయి కాబట్టి.. బ్లాక్ మెయిల్ చేయడానికి పక్కా ప్లాన్ చేశారు. ఈ కేసును అడ్డం పెట్టుకుని డబ్బులు వసూలు చేయడానికి కుట్ర పన్నినట్టు స్పష్ఠంగా తెలుస్తోంది. ఇందులో ఫస్ట్ దోషి మీసాల సుమన్.. ఆయన్ని అరెస్ట్ చేస్తే ఈ మహిళ జీవితంలోని ప్రతి మలుపు బయటపడుతుంది. అలాగే ఈ కేసులో కీలకంగా ఉన్న డాలర్ బాబుని అరెస్ట్ చేస్తే.. ఈ ఎపిసోడ్ మొత్తం ముగుస్తుంది. ప్రారంభంలో మీసాల సుమన్.. ఎండ్‌కి వచ్చేసరికి డాలర్ బాబు ఈ కేసులో కీలకంగా ఉన్నారు. మధ్యలో కొన్ని ఘటనలు జరిగాయి. కొన్ని జరగకపోయినా కేసులు వచ్చేశాయి. ఈ కేసు విషయంలో మేం బాధ్యతగా వ్యవహరించకపోతే మా మీద చాలా ఆరోపణలు వస్తాయి. ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకుని ఎస్టీ ఎస్ కేసుపెట్టి ఇంతమందిని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. ఒకవేళ ఆ కేసు తప్పుడు కేసు అని తేలితే సమాజంలో మా సంఘాల గౌరవం దెబ్బతింటుంది. మా కులాల, జాతులు గౌరవం దెబ్బతినే పరిస్థితి రానీయం. చట్టాన్ని కాపాడతాం. అనవసరంగా ఎవర్నీ ఇబ్బందులు పెట్టం. ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవాలు తెలుసుకుని మేం ముందుకు రాకపోతే.. పోలీస్ డిపార్ట్ మెంట్‌ మీద కూడా ఆరోపణలు వచ్చేవి. ఇప్పుడు మేం ఏదైతే విచారణ చేశామో.. పోలీస్‌లతో విచారణ చేసినా ఇదే వస్తుంది.. సీబీఐతో విచారణ చేసినా ఇదే వస్తుందని మేం ఖచ్చితంగా చెప్పగలం. ఇందులో మేం కనుక ఇన్వాల్వ్ కాకపోతే.. కొంతమంది ప్రముఖులు పేర్లు బయటకు వచ్చాయి. నిజానికి ఈ కేసులో వాళ్లకి సంబంధం లేదు. సోదరుడు టీవీ యాంకర్ ప్రదీప్.. పేరు వచ్చింది. అలాగే కవితగారి పీఏ పేర్లు బయటకు వచ్చాయి. మేం వాస్తవాలు తెలుకుని ముందుకు కాకపోతే.. ఒకవేళ ఈకేసులో ప్రదీప్ లేడని.. ఇంకోవ్యక్తి లేడని పోలీసులు నిర్ధారించినా.. కావాలని ఈ కేసు నుంచి వారిని తప్పించారనే వాదన వచ్చేది. రాజకీయ పలుకుబడి.. ఆర్థిక పలుకుబడితో ఈ కేసుల నుంచి తప్పించారనే అనేవారు. దాన్ని అరికట్టడం కోసమే పోలీసులు ఈ కేసులో కావాలని వారిని తప్పించినట్టుగా కాకుండా.. దళిత, మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే వాస్తవాలు బయటకు తీసుకుని రావాలనే పద్దతిలో మేం నిజాలను తెలుసుకోగలిగాం. క్లియర్‌గా చెప్తున్నాం ఈ రేప్ కేసులో యాంకర్ ప్రదీప్‌కి ఎలాంటి సంబంధం లేదు. ప్రదీప్ ఏ కులం వాడు.. ఏ మతం వాడు అని కాదు.. అనవసరంగా బాధ పెట్టకూడదు. కేవలం ఈ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి.. ఆమెపై అత్యాచారం చేసి.. నువ్ నా మాట విని పలానా వాళ్లపై కేసు పెట్టకపోతే.. నిన్ను కూడా చంపేస్తాం అని బెదిరించి ఆమెను చిత్ర హింసలకు గురి చేశారు. కేవలం డాలర్ బాబు బెదిరింపులకు చిత్ర హింసలకు భయపడే ఈమె సెలబ్రిటీల పేర్లను, మరికొందరి పేర్లను ఇందులో పెట్టింది తప్ప ఈ కేసులో వాళ్లకు సంబంధం లేదు. యాంకర్ ప్రదీప్‌కి ఈ కేసుకు సంబంధం లేదు.. అతను అత్యాచారం చేయలేదు. అలాగే కవిత పీఏ ఆమెపై అత్యాచారం ఒడికట్టలేదు కాని.. నీ దగ్గర ఉన్న ఫొటోలు పంపమని మాత్రం బెదిరించినట్టు తెలుస్తోంది. ఈ కేసు విషయంలో అత్యాచారం చేసిన వాళ్లు ఏ కులం వారు.. ఏ మతం వారైనా సరే.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.. అలాగే ఆమెను బెదిరించి బ్లాక్ మెయిల్‌కి పాల్పడినవాళ్లును అదుపులోకి తీసుకోవాలి. ఎవరి మీదనైతే తప్పుడు కేసులు ఉన్నాయో.. పెట్టించిన డాలర్ బాబుని అరెస్ట్ చేయాలి.. ఈకేసులో అమాయకుల్ని, కేసుతో సంబంధం లేని వాళ్లని అరెస్ట్ చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా’ అంటూ సంచలన విషయాలను బయటపెట్టారు కృష్ణమాదిగ. Read Also:


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ