Jersey Movie: నానికి అరుదైన గుర్తింపు.. అంతర్జాతీయ చిత్రోత్సవానికి ‘జెర్సీ’

నేచురల్ స్టార్ నానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అంతర్జాతీయ చిత్రోత్సవానికి నటించిన 'జెర్సీ' చిత్రం ఎంపికైంది. నాని నటనా ప్రతిభకు నిదర్శనంగా నిలిచిన చిత్రం ఇంటర్నేషనల్ ఇండియన్ టొరంటో ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ఎంపికైంది. ఆగష్టు 9 నుంచి 15 వరకూ జరిగే ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ‘జెర్సీ’ చిత్రం ప్రదర్శన కానుంది. 2019 ఏప్రిల్ 19 విడుదలైన జెర్సీ చిత్రం.. నానిని నటుడిగా మరో మెట్టు ఎక్కించింది. నాని, శ్రద్ధా శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా నటించారు. తన తండ్రిని హీరోగా చూడాలని కోరుకున్న ఓ కొడుకు చెప్పే కథే ‘జెర్సీ’. ‘జెర్సీ’ కథ వందలో సక్సెస్ అయిన ఒక్కడిది కాదు. సక్సెస్ అవ్వకపోయినా ప్రయత్నిస్తూ మిగిలిపోయిన 99 మందిది. ఈ చిత్రంలో నాని కొడుకుగా రోనిత్ అద్భుతమైన పాత్రను పోషించారు. సత్యరాజ్, రావు రమేష్, ప్రవీణ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ‘మళ్లీ రావా’ వంటి ఫీల్ గుడ్ మూవీతో దర్శకుడిగా ప్రశంసలు దక్కించుకున్న గౌతమ్ తిన్ననూరి క్రికెట్ నేపథ్యంలో జర్నీని ‘జెర్సీ’గా ప్రేక్షకులకు అందించారు. సితార ఎంటర్ టైన్మెంట్స్‌లో సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. సోనూ జాన్ సినిమాటోగ్రఫీ అందించగా.. అనిరుధ్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ ఇంటర్నేషనల్ ఇండియన్ టొరంటో ఫిలిం ఫెస్టివల్‌లో నాని ‘జెర్సీ’తో పాటు.. కార్తీ నటించిన ‘ఖైదీ’, సూపర్ 30 సినిమాలు ఎంపికయ్యాయి.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ