చిరంజీవిపై తప్పుడు ప్రచారం.. అసలు నిజం చెప్పిన వర్మ.. మెగా ఫ్యాన్స్ నమ్మాల్సిందే

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి మెగా ఫ్యామిలీతో ఉన్న వివాదం ఏంటి?? అసలు ఆయన పదే పదే మెగా ఫ్యామిలీనే ఎందుకు టార్గెట్ చేస్తారు.. ఈయన తిట్టడమే కాకుండా శ్రీరెడ్డి లాంటి వివాదాస్పద నటితో తిట్టించేటంత కసి ఈయనలో ఎందుకు?? ఈయనతో సినిమా చేయలేదనే కారణంగా ఆ ఫ్యామిలీపై కసి పెంచుకున్నారా?? , పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు.. ఆ కుటుంబం నుంచి వచ్చిన ఏ హీరో కూడా వర్మతో పనిచేయకపోవడానికి కారణం ఏమై ఉంటుంది.. వర్మతో మెగా ఫ్యామిలీకి నిజంగానే విభేధాలు ఉన్నాయా?.. ఈ ప్రశ్నలు మెగా అభిమానుల్లోనే కాదు.. సగటు ప్రేక్షకుడి మదిలో మెదులుతూ ఉంటాయి. అయితే వీటిపై ఎట్టకేలక క్లారిటీ ఇచ్చారు . అంతేకాదు గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లతో సినిమా ఎందుకు వదులు కోవాల్సి వచ్చిందో కూడా వివరించారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ‘ఇది పాతికేళ్ల నాటి విషయం.. అప్పటికి పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలేదు.. అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నారు. అప్పట్లో నేను ఆయనకు ఒక కథ వినిపించా.. ఆ కథలో ఆయన హీరో కాదు.. కీలకమైన రోల్. అయితే హీరోగా ఎంట్రీ ఇచ్చే ఆలోచన ఉన్న పవన్ కళ్యాణ్ ఆ పాత్ర చేయనన్నారు. అది ఆయన ఇష్టం.. నిజానికి పవన్ తీసుకున్న నిర్ణయం మంచిదే.. ఎందుకంటే పవన్ చేయనన్న పాత్ర నేను వేరే వాళ్లతో చేయించా.. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తరువాత పవన్‌ని పలు సందర్భాల్లో మాట్లాడాను.. పార్టీ స్థాపించినప్పుడు కూడా ఫోన్ చేసి అభినందించా. నిజానికి పాతికేళ్ల క్రితం జరిగింది నాకే కాదు.. ఆయనకి కూడా గుర్తుండకపోవచ్చు. అప్పుడే అనిపించింది పవన్ కళ్యాణ్ జడ్జిమెంట్ రాంగ్ కాదు అని. ఇక చిరంజీవితో నాకు విభేదాలు.. మెగా ఫ్యామిలీతో పడదని అంటారు... వాళ్లంటే కోపం అని అంటారు. నిజానికి నేను నా లైఫ్‌లో నేను ఎవరిపైన కోప్పడను. ఎందుకంటే.. నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వను. కోపం అనేది వ్యాలిబుల్ ఎమోషన్. నాకు ఏ మాత్రం ఇంటరాక్షన్ లేకుండా ఒక మనిషిపై కోపం చూపించాల్సిన అవసరం నాకేం ఉంది.. నాకు చిరంజీవి ఫ్యామిలీపై కోపం లేదు.. పగ లేదు.. ఏం లేదు. చిరంజీవితో సినిమా చేయాలని అనుకున్నాను.. కథ ఆయనకు నచ్చింది.. అయితే నేను చేసిన మిస్టేక్స్ వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఆ సినిమా ఆగిపోయిన సందర్భంలో ఆయన చెప్పకుండానే.. నేనే పత్రికాముఖంగా అందులో నా తప్పే ఉందని ఎన్నోసార్లు చెప్పాను. అప్పట్లో ఊర్మిళ, చిరంజీవితో సినిమా తీయాలని అనుకున్నా.. నా మిస్టేక్స్ వల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. చిరంజీవి గారు చేసిన తప్పు లేదు.. ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి కారణం.. ఆయన నా డైరెక్షన్‌లో వేలు పెట్టారని రూమర్స్ వచ్చాయి. అవి నిజం కాదు. అదంతా తప్పుడు ప్రచారం.. చిరంజీవి ప్రొఫెషనల్ యాక్టర్. నా సినిమానే కాదు.. ఆయన ఎవరి సినిమాలోనూ వేలు పెట్టరు. నటుడిగా పూర్తి న్యాయం చేయడానికి చూస్తారు. సినిమా ఆగిపోవడానికి రీజన్ అది కాదు.. నా పర్శనల్ రీజన్. ఇందులో చిరంజీవి గారి తప్పు లేదు’ అంటూ అసలు విషయం చెప్పుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ