యాంకర్ ఝాన్సీ, సింగర్ సునీత కన్నీటి పర్యంతం.. ఇద్దరి పెళ్లి మళ్లీ ఎప్పుడు?

సినిమా ఫీల్డ్.. కంటికి కనిపించే రంగుల వెనుక చీకటి జీవితాలు లెక్కల్లో తేలేవి కావు. ఒక్కొక్కరిదీ ఒక్కో బతుకు పోరాటం.. గెలిచిన వాళ్లు విజేతలుగా నిలిచినా.. వారి వారి వ్యక్తిగత జీవితాల్లో ఆనందం శూన్యమే. ఒంటిపై రంగు.. ముఖంపై చిరునవ్వు కెమెరా ముందు వరకే.. ఒక్కసారి పర్సనల్ లైఫ్‌లోకి తొంగిచూస్తే ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యధ. , .. పేరు, పలుకుపడి, డబ్బు, హోదా అన్నీ ఉన్నాయి. కాని గ్లామర్ ఫీల్డ్‌లో చాలామందికి ఎదురయ్యే సమస్యే వీళ్లనూ వెంటాడింది. భర్తతో విభేధాల కారణంగా వాళ్లకు దూరమై.. పిల్లల కోసం ఒంటరి జీవితం ఈదుతున్నారు. మళ్లీ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఈ ఇద్దరికీ పలు సందర్భాల్లో ఎదురైనా చిరునవ్వే సమాధానం అంటూ దాటవేసిని ఈ ఇద్దర్నీ మళ్లీ అదే ప్రశ్న వేసి నవ్వించాడు.. ఏడిపించాడు.. కమెడియన్ అలీ. ఈటీవీలో ప్రసారమయ్యే ‘’ కార్యక్రమానికి గెస్ట్‌లుగా వచ్చారు సింగర్ సునీత, యాంకర్ ఝాన్సీ. ఆగష్టు 3న ప్రసారం అయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా.. దాదాపు నాలుగు నిమిషాల నిడివితో ఉన్న ఈ ప్రోమో చాలా ఎమోషనల్‌గా సాగింది. ఆడారు.. పాడారు.. నవ్వించారు.. చివరికి ఏడిపించేశారు. మొదటిగా ఝాన్సీని స్టేజ్ మీదికి తీసుకువచ్చిన అలీ.. మనం కూర్చుంటే మరో సర్ ప్రైజ్ ఉంది.. చిన్నపిల్ల ఇక్కడికి రాబోతుంది అంటూ సింగర్ సునీతను పిలిచారు. ఆమె పాడిన నీలి నీలి ఆకాశం పాట.. యూట్యూబ్‌ని షేక్ చేస్తూ మిలియన్ల వ్యూస్ కొల్లగొడుతుండటంతో ‘మీ నీలి నీలి ఆకాశం’ యంగ్ ఏజ్‌లో ఎవరికైనా ఇచ్చారా? మీకు చాలా మంది కర్చీఫ్‌లు వేసి ఉంటారు.. మీరు ఒక్క కర్చీఫ్ కూడా తీసుకోలేదా? అలీ ఎప్పటిలాగే సెటారికల్ ప్రశ్న వేశాడు. ‘అవును.. వేసేవారు.. నా దగ్గర చాలా కర్చీఫ్‌లు ఉన్నాయి’ అంటూ సమాధానం ఇచ్చింది సింగర్ సునీత. సునీత చీరలకు ఫ్యాన్స్ ఉన్నారు తెల్సా.. అని అలీ అనడంతో.. ‘ఆమె కట్టుకుంటే చీరలకే అందం వస్తుంది సార్’.. అని మోసేసింది యాంకర్ ఝాన్సీ. హా!! నేనూ చూశా.. 1999 నుంచి అంటూ సెటైర్ వేశాడు అలీ. మీరు ఆ.. అనడంలోనే కాదు.. కాలు కదిపినా అందులో అర్థం ఉంటుంది అంటూ ఝాన్సీ, సునీతలు అలీపైనే సెటైర్లు వేశారు. ఇక ఝాన్సీ పాటపాడటం.. మీటర్ కాస్త లేపు పాడు అని అలీ పంచ్ వేయడం.. ఇంతకీ మీరు ఎప్పుడైనా పాట పాడారా? అని సునీత అనడం.. నేనెప్పుడే చిన్నప్పుడు పాడా అని అలీ చెప్పడం.. మీకు మీరే మాకు మేమే అని అలీకి సునీత పాట నేర్పించడం అంతా ఫన్‌గా సాగింది. ఎవరికైనా గొంతులో గమకాలు పలుకుతాయి.. ఈయనకు శరీరం అంతా గమకాలు పలుకుతున్నాయ్ అని అలీకి పంచ్ విసిరారు సునీత. ఇక ఇటీవల సునీత మేనల్లుడుని అంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి ప్రస్తావన తీసుకువచ్చారు అలీ.. ఏంటీ ఈ మధ్య బాగా రెబల్ అయ్యారంట.. అని అడగడంతో.. ట్రూ కాలర్‌లో వాడెవడో నా పేరు పెట్టుకుని మోసాలు చేస్తున్నాడు. వాడిపై లీగల్ యాక్షన్ తీసుకున్నా అంటూ సమాధానం ఇచ్చింది సునీత. అప్పటి వరకూ సరదాగా జరిగిన ఈ ఇంటర్వ్యూని ఒక్క ప్రశ్నతో సీరియస్‌గా ఎమోషనల్‌గా మార్చేశాడు అలీ.. ‘సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా.. మీ ఇద్దరిలో కామన్ పాయింట్.. మీ ఇద్దరూ మళ్లీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు’? అని అడిగాడు. ‘మేం ఇద్దరం పెళ్లి చేసుకోవాలా’?? అలీగారూ అంటూ చాలా సరదాగా స్పందించారు ఇద్దరూ. ఆ తరువాత ఈ ప్రశ్నకు ఆడియన్స్ వందల ఆన్సర్ వేసేసుకున్నారు. నేను ఈరోజు ఏం చెప్పినా అవసరం లేదు సార్’ అంటూ తెలివైన ఆన్సర్ ఇచ్చింది ఝాన్సీ. ఆ తరువాత ఝాన్సీ లిప్ లాక్ సీన్ గురించి.. అలాగే రెండు మూడు పెగ్‌లు వేసి సునీత పాటపాడితే ఎలా ఉంటుందో వినిపించారు. చివర్లో మీ ఇద్దరి గురించి ఒకాయన ఏదో మాట్లాడారు.. వింటారా? అని సస్పెన్స్ క్రియేట్ చేయగా.. ఆయన మహానుభావుడు అంటూ ఝాన్సీ, సునీతలు కన్నీటి పర్యంతం అయ్యారు. ఆ వ్యక్తి ఎవరు?? వాళ్లు ఎందుకు ఏడ్చారు అన్న సస్పెన్స్‌తో ప్రోమోను కట్ చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఆగష్టు 3న ఈటీవీలో ప్రసారం కానుంది. Gnapika Entertainments Private Limited


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ