అఖిల్‌‌కు పూజా రొమాంటిక్ కిక్.. అదిరిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ పోస్టర్

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో… అక్కినేని హీరో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిసమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో పూజ తన కాళ్లతో అఖిల్ చెవుల్ని టచ్ చేస్తూ ఉంటుంది. అఖిల్ సోఫాలో కూర్చోని కాఫీ తాగుతూ ల్యాప్‌టప్‌లో ఏదో వర్క్ చేస్తుండగా.. అతని వెనకాలే చైర్ పై కూర్చున్న పూజ తన కాళ్లతో అఖిల్ చెవుల్ని తాకుతూ డిస్టర్బ్ చేస్తుూ ఉంటుంది. మా బ్యాచిలర్ & బ్యాచిలరెట్ క్వారంటైన్ లైఫ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి అంటూ ఒక రొమాంటిక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అయితే ఈ పోస్టర్ విడుదలైన కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Read More: ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో మురళీ శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాపై అఖిల్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని చిత్ర యూనిట్ భావిస్తోంది. గోపీ సుందర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు ఫస్ట్ లిరికల్ 'మనసా మనసా' అంటూ సిద్ శ్రీరామ్ ఆలపించిన సాంగ్ మంచి టాక్ సొంతం చేసుకుంది. యూత్‌ను ఆకట్టుకునేలా ఈ సినిమా రొమాంటిక్‌గా ఉంటుందని సినిమా యూనిట్ చెబుతోంది.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ