Anchor Varshini: ఆది అక్కడ బాగా రొమాంటిక్.. వర్షిణీ!! అక్కడ అంటే ఎక్కడో చెప్పు అంటూ ఓపెన్ అయ్యాడు

పెళ్లి కళ వచ్చేసిందే బాలా.. పల్లకిలి తెచ్చేసిందే బాలా.. అంటూ హుషారైన పాటతో ఎంట్రీ ఇచ్చింది యాంకర్ వర్షిణి. అదేంటి.. జబర్దస్త్‌లో స్టెప్పులేస్తే అనసూయ వేయాలి కాని.. ఏంటి అంటే ‘ఢీ’ షోనుంచి ఈమెను ‘జబర్దస్త్’ స్టేజ్ మీదికి తీసుకుని వచ్చారు. నాది మల్టీ హీరోయిన్ పర్శనాలిటీ అంటారు అంటూ తెగ పొంగిపోతున్న వర్షిణికి ఆది ఆదిలోనే పంచ్ వేశాడు. ఇది మల్టీ డిజార్డర్ పర్సనాలిటీ అంటారు పోయి డాక్టర్‌కి చూపించుకో అని పంచ్ పేల్చాడు. అక్కడ రొమాంటిక్ గానే ఉంటావు కదా.. ఇక్కడేంటి ఇలా ఉంటావు అని వర్షిణి అడగడంతో.. అక్కడా అంటే ఢీ అని క్లియర్‌గా చెప్పు.. లేదంటే ఎక్కడెక్కడో అనుకుంటారు అని లేనిపోని డౌట్‌లను రైజ్ చేసి యూట్యూబ్ ఛానల్స్‌కి మంచి థంబ్ నెయిల్ ఇచ్చాడు ఆది. ఇక వర్షిణి పక్కన నిలబడాలంటే ఓ రేంజ్ ఉండాలిరా.. అని వర్షిణి పక్కకు వచ్చి ఆది స్టైల్‌గా నిలబడే ప్రయత్నం చేయగా.. నువ్ పక్కకి వెళ్లరా అంటూ ఆదికి దిమ్మదిరిగే పంచ్ వేసింది వర్షిణి. మొత్తానికి వీరి కాంబినేషన్‌లో స్కిట్ బాగా పేలేట్టుగానే ఉంది. ఇక రాకెట్ రాఘవ, చలాకీ చంటిలు కూడా ఫన్ నింపే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా చలాకీ చంటి టీంలో సుధాకర్, దుర్గారావు‌లు తెగ నవ్వించారు. లేడీ డిటెక్టివ్ అవతారం ఎత్తాడు సుధాకర్. ఇక దుర్గారావుతో పాటు.. సుధాకర్‌తో ‘మాస్క్’‌పై ఓ భారీ డైలాగ్ చెప్పించడానికి ముప్పుతిప్పలు పడ్డారు. చివర్లో లోకనాయకుడు పాటకి తుపుక్ తుపుక్ మూవీ హీరో అభి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. ‘మన సినిమా గురించి ఆడియన్స్ ఏమంటున్నారురా.. అంటే!!’ సినిమా అవ్వగానే ఆడియన్స్ మైక్ దగ్గరకు వచ్చి సినిమా పేరు చెప్పివెళ్లుపోతున్నారని టీం సభ్యుడు అనడం.. ఇంతకీ ఏం అంటున్నారురా అని అభి అడిగితే.. జడ్జీ రోజా ‘తుపుక్.. తుపుక్’ అని అనడం హాస్యం బాగానే పండింది. మొత్తానికి వచ్చే వారం ఆగష్టు 6 ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో.. ఎప్పటిలాగే జబర్దస్త్ ఎంటర్ టైన్మెంట్ అందించడం ఖాయం ఈ ప్రోమోతో హింట్ ఇచ్చారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ