బిగ్ బాస్ 4లో ప్రముఖ ఛానల్ యాంకర్.. ఆమెను తట్టుకోవడం కష్టమే సుమీ!

బిగ్ బాస్ సీజన్ 4 ప్రోమో పడటంతో ఈ సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరన్న ఆసక్తి బుల్లితెర వర్గాల్లో ఉంది. ఇప్పటికే 15 మంది కంటెస్టెంట్స్‌తో కూడిన లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 1. పూనమ్ భజ్వా 2. శ్రద్దాదాస్ 3. హంసా నందిని 4. సింగర్ సునీత 5. మంగ్లీ (సింగర్) 6. హీరో నందు (గీతా మాధురి భర్త) 7. వైవా హర్ష 8. అఖిల్ సార్దక్ 9. యామినీ భాస్కర్ 10. మహాతల్లి (యూట్యూబ్ సంచలనం) 11. అపూర్వ 12. పొట్టి నరేష్ (జబర్దస్త్ కమెడియన్) 13. మెహబూబా దిల్ సే (యూట్యూబ్ స్టార్) 14. ప్రియ వడ్లమాని 15. సింగర్ నోయల్ ఈ 15 మంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా.. శ్రద్ధాదాస్ తాను బిగ్ బాస్‌లో పాల్గొనడటం లేదని తెలిపింది. వీరితో హీరో తరుణ్, యాంకర్లు విష్ణు ప్రియ, ఝాన్సీలు తమకు బిగ్ బాస్‌కి వెళ్లే ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు. అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సీజన్‌లో ఓ ప్రముఖ టీవీ ఛానల్‌కి చెందిన యాంకర్ ఉండబోతుందట. గత రెండు సీజన్లు (సీజన్ 2, సీజన్ 3)లలో ఈ ఛానల్ తరుపున ఇద్దరు యాంకర్లు రంగంలోకి దిగారు. సీజన్ 2లో దీప్తి నల్లమోతు బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా రాగా.. సీజన్ 3లో జర్నలిస్ట్ జాఫర్ బిగ్ బాస్ కంటెంస్టెంట్‌గా హౌస్‌కి వెళ్లిన విషయం తెలిసింది. ఇదే సాంప్రదాయాన్ని మూడో సీజన్‌లోనూ కొనసాగిస్తూ ఈ ఛానల్ నుంచి మరో యాంకర్ బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ ప్రసారమైన అన్ని రోజులు కూడా.. ఆ ఛానల్‌లో గంటపాటు స్పెషల్ ప్రోగ్రామ్ నడిపి.. అప్డేట్స్ అందించి బాగా ప్రమోట్ చేసేవారు. ఇప్పుడు సీజన్ 4 ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ ఛానల్‌లో స్పెషల్ డిస్కషన్స్ మొదలు పెట్టేశారు. ఇక ఎలక్టానిక్ మీడియా రంగాన్నే కొత్త పుంతలు తొక్కించిన ఆ ఛానల్ నుంచి బిగ్ బాస్ సీజన్ 4లో అడుగుపెట్టబోయే ఆ ప్రముఖ యాంకర్ ఎవరనేదానిపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. హెయిర్ స్టైల్‌లో కాని.. వస్త్రధారణలో కాని.. న్యూస్ ప్రజెంటేషన్‌లోకాని.. విచిత్రంగా కనిపించే ఆ యాంకర్ బిగ్ బాస్‌కి వస్తే రచ్చ మామూలుగా ఉండదని చర్చ మొదలైంది. బ్రేకింగ్ కాని వార్తను కూడా సన్సేషన్ చేయడంలో ముందుండే ఆ ప్రముఖ యాంకర్ బిగ్ బాస్‌కి వస్తే.. బిగ్ బాస్ షో పెద్ద సన్సేషన్ కావడం ఖాయమే అని అభిప్రాయపడుతున్నారు. కొందరైతే వామ్మో.. ఆమెనా?? తట్టుకోవడమే కష్టమే సుమీ అని సెటైర్లు వేస్తున్నారు.
Comments
Post a Comment