వెనక నుంచి పట్టుకోవడం ఆపరేమో.. ఎక్స్ ట్రా జబర్దస్త్‌లో ఎక్ ట్రా రుద్దుడు.. హే పృథ్వీ!

లాక్ డౌన్‌కి ముందు కమెడియన్ పృథ్వీ.. ఒక మహిళతో రొమాంటిక్‌గా ‘వెనుక నుండి పట్టుకుంటా..’, ‘గుర్తుకు వస్తున్నావ్..’ అంటూ మాట్లాడిన ఆడియో క్లిప్పింగ్ ఒకటి బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ‘వెనకనుంచి పట్టుకోవడం’ అనే డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. దాంతో ఎవరికి ఇష్టం మొచ్చినట్లు వాళ్లు వాడేస్తున్నారు. అప్పటి నుంచి అన్ని కామెడీ షోల్లోనూ ఈ ‘వెనక నుంచి పట్టుకోవడం’ అనే డైలాగ్‌ని విరివిగా వాడుతూ కామెడీ చేస్తున్నారు. తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్‌లో కూడా అదే రుద్దుడు కనిపిస్తోంది. జూలై 3 ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోలో.. కమెడియన్ శాంతి స్వరూప్ ఈ డైలాగ్ వాడి.. మరోసారి పృథ్వీని, ఆ ఆడియో క్లిప్పింగ్‌ని గుర్తుచేస్తూ పంచ్ వేశాడు. స్కిట్‌లో భాగంగా గబ్బర్ సింగ్ బ్యాచ్.. శాంతి స్వరూప్‌ని పల్లకిలో మోసుకొస్తారు. ‘జేజమ్మా మాయమ్మా’ సాంగ్ ప్లే అవుతుంటే.. శాంతి బయటికి రావడం భలే కామెడీగా ఉంది. తర్వాత గబ్బర్ సింగ్ బ్యాచ్.. ‘శాంతి మా చెల్లెలు, ఆమెకు అన్నీ నేర్పించేందుకు ఓ టీచర్‌ కావాలి’ అంటూ ఓ వ్యక్తిని పిలిపిస్తారు. ‘వినవే బర్రెపిల్లా..’ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన రాకింగ్ రాకేష్.. శాంతికి అన్నీ నేర్పించే ప్రయత్నం చేస్తుంటాడు. రాకేష్ సీరియస్‌గా.. ‘రసాల గురించి నేర్పిస్తాను అర్థమైందా.. బీభత్స రసం, రౌద్రం, భయానకం, శృంగారం.. అంటూ వివరిస్తుంటాడు. ఇంతలో శాంతి.. శృంగారం అన్న మాట వినగానే.. ‘అదెక్కడ మరిచిపోతావోనని భయపడ్డాను’ అంటూ రాకేష్‌ని పట్టుకోవడంతో జడ్జ్ రోజా పడి పడి నవ్వడం హైలెట్. అన్ని నేర్పించే క్రమంలో శాంతిని రాకేష్ ఇలా ప్రశ్నిస్తాడు. ‘ఇప్పుడు ఒక దొంగ నీ దగ్గర నుంచి పర్స్ పట్టేసుకుని పారిపోతున్నాడనుకో.. అప్పుడు నువ్వేం చేస్తావ్?’ అని రాకేష్ అడగగానే... ‘పరిగెత్తుకునెళ్లి వెనక నుంచి లటుక్కున పట్టుకుంటాను’ అని శాంతి బదులిస్తూ.. పృథ్వీ డైలాగ్‌ని వాడేసింది.దాంతో జబర్దస్త్ నవ్వులు మొదలయ్యాయి. వెంటనే రాకేష్.. ‘అరవాలి కదా..?’ అని అనడంతో.. ‘వాడు అరుస్తాడు కదా..’అంటూ శాంతి పంచ్ పేల్చడంతో నవ్వులు ఫక్కుమన్నాయి. మొత్తానికి లాక్ డౌన్ తర్వాత కూడా పృథ్వీని, వెనకనుంచి పట్టుకోవడాన్నీ వదిలిపెట్టలేదు జబర్దస్త్.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ