వలసకూలీ వ్యధపై హరీష్ శంకర్.. కళ్లు చెమర్చే పోస్ట్

అగమ్యగోచరంగా వలస కూలీల బతుకులు.. కరోనా మహమ్మారితో దేశవ్యాప్తంగా వలసకూలీలు బతుకులు కకావికలమవుతున్నాయి.. ఉన్న చోట ఉందాం.. కడుపు నిండా తిందాం అంటే బతుకులు రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి. పోనీ సొంత ఊర్లకు వెళ్లిపోదాం అంటే రవాణా సౌకర్యాలు లేవు. కాలి నడకే బతుకు బాట అయ్యింది. కరోనా వైరస్ తమని ఎక్కడ కబళిస్తుందోనన్న భయంతో.. ఈ కాలే కడుపుల బాధలు వర్ణానాతీతం. బిడ్డల్ని చంకనెట్టుకున్న తల్లి.. కాళ్లకు చెప్పులు కూడా లేని బిడ్డ.. రక్తమోడుతున్న పని కాళ్లు.. కడుపు తరుక్కుపోయే వలస కూలీ ధీన గాధ.. వందల, వేల కిలోమీటర్లు నడుస్తూ మార్గం మధ్యలోనే చనిపోతున్న ఈ వలస కూలీల బతుకుల్ని కళ్లకు కడుతూ కంటతడిపెట్టించేలా కవిత రాశారు దర్శకుడు . ‘బండరాళ్లని పిండి చేసిన చేతులు ఎడమపక్క డొక్క నొప్పికి లొంగిపోయాయి. పెద్ద పెద్ద ఇనుప చువ్వలని వంచిన వేళ్ళు మెత్తని పేగుల ముందు ఓడిపోయాయి. మేం వేసిన రోడ్లే మమ్మల్ని వెక్కిరిస్తుంటే బతకడం కోసం ఊరొదిలొచ్చిన మేము చచ్చేలోపు ఊరెళితే చాలనుకుంటూ.. ఆకలి అడుగులతో.. పేగులు అరుపులతో.. కాళ్లు, కడుపు ఒకేసారి కాలుతుంటే .. మమ్మల్ని చూసే లోకులకి బాధేస్తోంది.. జాలేస్తోంది.. కానీ మాకు మాత్రం ‘ఆకలేస్తోంది’!! నిస్సహాయతతో..’’ అంటూ మనసును కదిలించేలా రాసారు హరీష్ శంకర్.
Comments
Post a Comment