‘డెలివరీ బోయ్’గా మారిన నోయల్.. సపోర్ట్ చేయమంటోన్న రాహుల్

ఇంట్లో కూర్చొని మొబైల్‌లో చాలా సింపుల్‌గా మనకు ఇష్టమైన ఫుడ్‌ను ఆర్డర్ చేస్తే చాలు.. డెలివరీ బోయ్ అటుఇటుగా అరగంటలో పార్సిల్‌ను మన ముందు ఉంచుతాడు. కంపెనీ నుంచి వచ్చే ఒత్తిడి.. కస్టమర్‌కు సమయానికి ఫుడ్ అందజేయాలనే బాధ్యతతో ట్రాఫిక్ బారులు తీరినా ఎలాగోలా కష్టపడి ఆన్ టైమ్‌లో పార్సిల్ మన గుమ్మం ముందు పెడతాడు డెలివరీ బోయ్. లాక్‌డౌన్ సమయంలో అందరూ ఇళ్లలో ఉన్నా ముఖానికి మాస్క్ వేసుకుని మరీ ఫుడ్ డెలివరీ చేశాడు. అందుకే, అలాంటి డెలివరీ బోయ్‌కి ప్రముఖ ర్యాప్ సింగర్ నోయల్ సీన్ ఒక పాటను అంకితం ఇచ్చారు. ‘హే డెలివరీ బోయ్’ అంటూ అదిరిపోయే ర్యాప్ సాంగ్‌ను సంగీత ప్రియులకు అందించారు. Also Read: నోయల్ స్వయంగా రాసిన ఈ పాటను సింగర్ మోహన భోగరాజుతో కలిసి ఆలపించారు. ఎబెనెజర్ పాల్ స్వరపరిచారు. వినయ్ కుమార్ ఫైనల్ మిక్స్ చేశారు. అమీర్ సినిమాటోగ్రఫీ అందించారు. రాజేష్ కొరియోగ్రఫీ చేశారు. బ్లూ ర్యాబిట్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థ ఈ పాటను నిర్మించింది. పాటలో నోయల్ ర్యాప్ చాలా బాగుంది. చాలా సింపుల్ పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా డెలివరీ బోయ్ మనసులోని మాటలను పాట రూపంలో చెప్పారు. ఈ పాటను మరో సింగర్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ప్రమోట్ చేస్తున్నారు. ‘‘మన అన్న నోయల్ సీన్ ‘డెలివరీ బోయ్’ మ్యూజికల్ వీడియో లీకయ్యింది, రిలీజ్ కూడా అయ్యింది. మీరంతా ఈ పాటను చూడండి. మీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేయండి. దయచేసి ప్రోత్సహించండి. ఇండిపెండెంట్ మ్యూజిక్ అండ్ ఆర్టిస్ట్’’ అని రాహుల్ సిప్లిగంజ్ ట్వీట్ చేశారు. రాహుల్ సిప్లిగంజ్, నోయల్ మంచి స్నేహితులు. అందుకే, నోయల్ పాటను రాహుల్ ప్రమోట్ చేస్తున్నారు. చూద్దాం ఈ పాటకు సంగీత ప్రియుల నుంచి ఎలాంటి ప్రశంసలు అందుకుంటుందో!


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ