సోషల్ మీడియాలో సినీ నటి ప్రగతి హల్ చల్.. నడుమును తిప్పుతూ..

సినీ నటి ప్రగతి.. ప్రత్యేక పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తల్లిగా, పిన్నిగా, వదినగా, అత్తగా ఇలా అనేక రకాల పాత్రల్లో తనదైన స్టైల్లో నటించి అభిమానుల్ని మెప్పించింది. ఏ క్యారెక్టర్ ఇచ్చిన అందులో ఒదిగిపోతుంది. తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. లాక్ డైన్‌తో ఇంటికే పరిమితమైన ప్రగతి ఫిట్ నెస్‌పై ఫోకస్ పెట్టింది. రోజుకు రకరకాల వర్క్ అవుట్స్ చేస్తోంది. తాజాగా ప్రగతి చేసిన ఇనస్టా పోస్టు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రగతి ఆ మధ్య విజయ్ మాస్టర్ సినిమా సాంగ్ కి లుంగిలో తీన్మార్ స్టెప్పులు వేసి అలరించింది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌గా కూడా మారింది. తాజాగా మరో వీడియోతో సోషల్ మీడియాను షేక్ చేసింది ప్రగతి. మ్యూజిక్‌కి తగ్గట్టు తన నడుముని తిప్పుతూ యూత్‌ని ఎట్రాక్ట్ చేస్తోంది. బీట్‌కు తగ్గట్టు నడుము తిప్పుతూ.. తనకెంత ఫిట్ నెస్ ఉందో బయటపెట్టింది. ప్రగతి వయసు 44 ఏళ్ళు. అయినా సరే యువ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని ఎనర్జీతో దూకుడుతో ముందుకెళ్తోంది ఈ ఆంటీ. ప్రగతి బాడీలో ఇంత రిథమ్ చూసి ఫాలోవర్స్ సైతం షాక్ అవుతున్నారు. అప్పుడప్పుడు ఫిట్నెస్ కి సంబంధించిన టిప్స్ తో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తూ అలరిస్తుంది. నాలుగు పదుల వయసులో కూడా తన హోమ్లీ అందంతో అందర్నీ ఆకర్షిస్తోంది. వీలైనంత వరకు అందంగా కనిపించడానికే ప్రగతి ఎక్కువగా ఇష్టపడుతుందని తెలుస్తోంది. కెరీర్ మొదటి నుంచి ఏ పాత్ర చేసిన ఇష్టంతోనే చేస్తానని ఆ పాత్రలో అందంగా కనిపించడానికి ట్రై చేస్తానని చెబుతోంది.
Comments
Post a Comment