అనసూయ పీరియడ్స్ స్టోరీ: ఫస్ట్ పీరియడ్ సమయంలో! చెబితే గానీ అర్థం కావంటూ ఓపెన్ కామెంట్స్

ప్రతీ అమ్మాయి జీవితంలో పీరియడ్స్ (నెలసరి) సమయం అనేది ఎంతో కీలకమైన అంశం. ఈ సృష్టికి మూలం కూడా అదే. అలాంటి పీరియడ్స్ గురించి మాట్లాడటానికి, బయట చెప్పుకోవడానికి సిగ్గు పడుతూ అదేదో నేరం అన్నట్లుగా గోప్యంగా ఉంచుతుంటారంతా. కానీ జబర్దస్త్ బ్యూటీ మాత్రం.. తాను అందరిలో బిన్నం అని నిరూపిస్తూ పీరియడ్స్ స్టోరీ చెప్పి ఆ విషయాలపై ఓపెన్ అయింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ధైర్యంగా ఓ వీడియో షేర్ చేసి సంచలనం సృష్టించింది. దాదాపు 7 నిమిషాలున్న ఈ వీడియోలో పీరియడ్స్ గురించి నిర్మొహమాటంగా మాట్లాడింది అనసూయ. ఈ మేరకు తన మొదటి పీరియడ్ అనుభవాలను సైతం పంచుకుంది. మే 28న అంతర్జాతీయ నెలసరి పరిశుభ్రతా దినోత్సవం సందర్భంగా మెన్స్ట్రువల్ ఎడ్యుకేషన్‌కు సంభందించి ఓ స్వచ్ఛంధ సంస్థ నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో భాగంగా ఈ విషయాలపై స్పందించింది జబర్దస్త్ బ్యూటీ అనసూయ. Also Read: పీరియడ్స్ సమయంలో మహిళలకి సాయం అవసరమని, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం సరైందికాదని చెప్పుకొచ్చింది. ఇప్పటికీ సమాజంలో చాలా చోట్ల పీరియడ్స్ గురించి ఎన్నో అపోహలు ఉన్నాయని, పీరియడ్స్ అనేది తప్పు కాదని.. అమ్మాయిలు వాటి గురించి మాట్లాడటానికి భయపడకూడని అభిప్రాయపడింది అనసూయ. కొందరు మగవాళ్ళు పీరియడ్స్ సమయంలో అమ్మాయిలను అర్థం చేసుకోకుండా లోకువగా చూడటం సహించరానిదంటూ సీరియస్ అయింది. ఇంటికి మహాలక్ష్మి, ప్రపంచానికి మూలం ఆడవాళ్లే అని ఆమె చెప్పింది. ఇక తన మొదటి పీరియడ్ అనుభవాల గురించి పేర్కొంటూ.. ఫస్ట్ పీరియడ్ సమయంలో చాలా టెన్షన్ పడ్డానని చెప్పింది. ఆ సమయంలో దాదాపు రెండు వారాలు ఇంట్లోనే ఓ మూలాన కూర్చోబెట్టారని, ఆ తర్వాత ప్రతి నెలా పీరియడ్స్ సమయంలో మూడు నాలుగు రోజులు ఎవరినీ కలిసే ఛాన్స్ ఉండేది కాదని చెప్పింది. అయితే మొదట్లో తనకు ఈ విషయమై ఏం జరుగుతుందో తెలియకపోయినా 17 ఏళ్లు వచ్చిన తర్వాత అంతా అర్థమైందని తెలిపింది. ఇలాంటి విషయాలు దాచుకోకూడదని.. ఇవి ఇలా బాహాటంగా చెబితేనే ఈ తరం వాళ్లకు అర్థమవుతుందని ఆమె చెప్పడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ