జగన్ ఏడాది పాలనపై ‘యాత్ర’ దర్శకుడి వీడియో.. 90 శాతం హామీలు అమలు!

తండ్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బాటలో నడుస్తూ నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర చేసి ప్రజల మనసులు గెలుచుకున్నారు వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి. 151 సీట్లతో ఇప్పటి వరకూ ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఘన విజయం సాధించి నవ్యాంధ్ర సీఎం పీఠం ఎక్కారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి మే 30కి ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా ‘యాత్ర’ సినిమా దర్శకుడు మహి వి రాఘవ్.. జగన్ ఏడాది పాలనపై ఒక ప్రత్యేక వీడియోను చేశారు. ఈ వీడియోను జగన్‌కు అంకితం ఇచ్చారు. ‘వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అనే నేను’.. అని జగన్ ప్రమాణస్వీకారం చేసిన విజువల్‌తో ఈ వీడియోను మొదలుపెట్టారు మహి. ఈ ఏడాది కాలంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు, అమల్లోకి వచ్చిన పథకాలను ఈ వీడియోలో చూపించారు. ‘‘ఈ మధ్యకాలంలో నా మతం, నా కులం గురించి కూడా మాట్లాడుతున్నారు. నా మతం మానవత్వం అని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా’’ అని బహిరంగ సభలో జగన్ చెప్పిన మాట వీడియోలో హైలైట్‌గా ఉంది. ‘తొలి యేడు - జగనన్న తోడు’ అనే క్యాప్షన్‌తో వీడియోను ముగించారు. అంతేకాదు, ఏడాది పాలనలో మేనిఫెస్టో చెప్పిన 90 శాతం పైగా హామీలు అమలయ్యాయని పేర్కొన్నారు. Also Read: మొత్తం మీద ఈ వీడియో వైఎస్సార్‌సీపీ శ్రేణులకు, జగన్ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ అనే చెప్పుకోవాలి. వాళ్లలో ఉత్తేజాన్ని నింపే వీడియో. తన సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల కష్టాలను తెలుసుకున్నాని చెప్పిన జగన్.. జనం కష్టాలను తీర్చడానికి ‘నవరత్నాలు’ తీసుకొచ్చారు. తన తండ్రి బాటలో నడుస్తూ.. సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. ఈ నవరత్నాల అమలను ప్రధానం చేసుకునే మహి వి రాఘవ్ ఈ వీడియో చేశారు.
Comments
Post a Comment