16 ఏళ్లకే నాపై కర్చీఫ్ వేశాడాయన, తరువాత నేను టెంప్ట్ అయినా వద్దన్నాడు: అనసూయ

లాక్ డౌన్ అనుభవాలను ప్రేక్షకులతో పంచుకుంది జబర్దస్త్ భరద్వాజ్. షూటింగ్‌లు లేక ఇంట్లోనే ఉండిపోయిన అనసూయ ఎప్పుడెప్పుడు షూటింగ్‌లు ప్రారంభం అవుతుందా అని ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. ఇంట్లోనే ఉండి వంటలు బాగా నేర్చుకున్నానని పిల్లలకు రకరకాల వంటకాలను చేసి పెట్టినట్టు తెలిపిన ఆమె తన పర్శనల్ విషయాలను షేర్ చేసుకున్నారు. తన ఫస్ట్ క్రష్ 16 ఏళ్లకే మొదలైందన్నారు అనసూయ. వేరే వాళ్లపై క్రష్ ఏర్పడేటంత టైం తన భర్త ఇవ్వలేదని 16 ఏళ్లకే తనపై కర్చీఫ్ వేశాడని తన భర్త సుశాంత్ భరద్వాజ్‌తోనే ఫస్ట్ క్రష్ అంటూ తన లవ్ స్టోరీ చెప్పారు అనసూయ. తమ వివాహ బంధానికి పదేళ్లు అని గుర్తు చేసుకున్న అనసూయ తన ప్రేమ ఎన్ సీ సీలో అతన్ని చూశాను.. అప్పటికీ ప్రేమ గీమా ఏం అర్థం అయ్యేది కాదు.. ఒకర్నొకరం అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అయితే ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో నన్ను ఎంబీఏ కూడా మా ఆయనే చదివించారు. వాళ్ల అన్నయ్య యూకే నుంచి పంపిన మొబైల్‌ని అమ్మేసి నాకు ఫీజ్‌లు కట్టి చదివించారు. నేను హాస్టల్‌లో ఉంటూ చదువుకునేదాన్ని. మధ్యలో నేను రెండు సార్లు టెంప్ట్ అయ్యా.. హేయ్ పదా పెళ్లి చేసుకుందాం అని.. కాని ఆయన ఒప్పుకునేవారు కాదు.. పేరెంట్స్‌ని ఒప్పించినాకే పెళ్లి అనేవారు. అలా తొమ్మిది ఏళ్ల వెయిట్ చేసి మా నాన్నని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. నాకు ఆయనే ధైర్యం. ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత ఆయన సపోర్ట్ నాకు బాగా ఉంది. ప్రతిదీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటాం. అలా ఉండాలి.. ఇలా ఉండాలని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. ఒకరికి ఒకరు సపోర్ట్‌గానే ఉంటాం. మధ్య మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. మేమైతే ప్రతివారం విడాకులు తీసుకుంటాం (ఫన్నీగా నవ్వుతూ).. ఒకరి గురించి ఒకరు కంప్లైంట్స్ ఉండవు కాని.. ఎప్పుడూ థర్డ్ పర్శన్ గురించే గొడవలు వస్తుంటాయి. వాటి నుంచి వెంటనే రియలైజ్ అవుతుంటాం. ఆ తరువాత ముందు మన ఇద్దరం.. ఆ తరువాతే ఎవరైనా అని అనుకుంటాం దాంతో గొడవలు వచ్చినట్టే పోతుంటాయ్ అంటూ చెప్పుకొచ్చారు యాంకర్ అనసూయ.
Comments
Post a Comment