Rashmi Gautam: లాక్ డౌన్‌లో రష్మి బర్త్ డే.. అదే కేక్, వాళ్లే అతిథులు

తన జీవితంలోనే గుర్తుండిపోయే పుట్టినరోజు జరపుకున్నారు జబర్దస్త్ గౌతమ్. సెలబ్రిటీ బర్త్ డే అంటే పార్టీలు, కేక్‌లు, ఫ్రెండ్స్ ఇలా మామూలు హంగామా ఉండదు. ఇక కాస్తా పబ్లిక్ ఫిగర్ అయితే ఏర్పాట్లు గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇలాంటి విందు, వినోదాలు, ఆర్భాటాలను లాక్ చేసి పారేసింది కరోనా. దీంతో ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఇంట్లోనే హోమ్ మేడ్ కేక్‌తో సింపుల్‌గా కానిచ్చేస్తున్నారు. తాజాగా యాంకర్ వేడుకను నిరాడంబరంగా జరుపున్న వీడియోను షేర్ చేసింది. మూడు రోజుల క్రితమే రష్మి బర్త్ వేడుకలు జరుపుకోగా ఈ వీడియోను ఇప్పుడు షేర్ చేసింది రష్మి. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉన్న రష్మి తన తల్లితో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించుకున్నారు. అయితే కనీసం కేక్ కూడా లేకుండా తనకు ఎంతో ఇష్టమైన హల్వానే కేక్‌గా మార్చుకుని.. ‘హ్యాపీ బర్త్ డే మీ’.. హ్యాపీ బర్త్ డే మీ’ అంటూ తనకి తాను విషెష్ చెప్పుకుండా హల్వా‌ను కట్ చేసి.. ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది రష్మి. తన బర్త్ డేకి హల్వానే కేక్‌గా మారగా.. తన తల్లి, తను ఎంతో ఇష్టంగా పెంచుకునే కుక్కపిల్ల అతిథులయ్యారు. అయితే బర్త్ డే నాకు తనకు ఇష్టమైన హల్వాతో పాటు.. మసాలా దోస, వడలను కూడా తన తల్లి తనకోసం చేసిందని.. తన ప్రతి బర్త్ డే కూడా తన తల్లితో కలిసే చేసుకుంటానంటూ ఇది చాలా హ్యాపీ మూమెంట్ అంటూ పొంగిపోయింది రష్మి. ఆమె బర్త్ డే సందర్భంగా విషెష్ అందిస్తూ ట్వీట్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు ఆమె ఫాలోవర్స్.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ