Ram Charan: చెర్రీ, ఉపాసన పిల్లల ప్లానింగ్‌పై చిరు షాకింగ్ కామెంట్స్.. ఎంత చెప్పాలో అంతే చెప్తాం అంటూ..

ప్రేమ, పెళ్లి, పిల్లలు, మనవల్లు-మనవరాలు అనేవి మనిషి జీవితంలో కొత్త కొత్త బంధాలు పెనవేసుకునే మధుర స్మృతులు. వీటిల్లో ఉండే మాధుర్యం సరైన రీతిలో పొందాలే కాని.. ఇంతకంటే ఏం కావాలి ఈ జీవితాలకు అనుకునే వాళ్లు చాలా మందే ఉంటారు. ముఖ్యంగా పెళ్లై కొడుకు-కూతరు పెళ్లిళ్లు చేసిన తరువాత మనవల్లు-మనవరాల్లతో ఆడుకోవాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. ప్రస్తుతం మెగాస్టార్ తన కూతుళ్ల బిడ్డలతో తాత అని అనిపించుకున్నప్పటికీ నిజమైన వారసుడు కోసం ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్-ఉపాసనలు పెళ్లి చేసుకుని జూన్ 14 వస్తే ఎనిమిదేళ్లు అవుతుంది. 2012లో వీరి వివాహం జరగ్గా ఇంత వరకూ పిల్లలు లేరు. అయితే రామ్ చరణ్-ఉపాసనల పెళ్లి, పిల్లలు అనేది వారి పర్శనల్ విషయాలు కాబట్టి.. వారిదే తుది నిర్ణయం. అయితే తనకూ నిజమైన వారసుడు-వారసురాలు ఉండాలని.. తాత కావాలని ఉంటుందిగా అంటూ మనసులో కోరికను బయటపెట్టారు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా ఈ ఇష్యూపై మాట్లాడుతూ.. ‘నిజమైన వారసుడ్ని ఎత్తుకోవాలని నాకూ ఉంది. నా భార్య సురేఖ.. చరణ్-ఉపాసనలను అడుగుతూనే ఉంది. కాని వాళ్ల పిల్లల ప్లానింగ్ ఏంటో మాకూ అర్థం కావడం లేదు. అది వాళ్ల పర్శనల్ విషయం.. అందులో మనం ఎంత వరకూ చెప్పాలో అంతవరకే చెప్పగలం. తరువాత వాళ్ల ఇష్టం. పిల్లల్ని కనొచ్చుగా అంటే... ఏదో ప్లానింగ్ అంటుంటారు. అదేం ప్లానింగో తెలియదు. అది వాళ్ల ఇష్టం’ అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి. Read Also:
Comments
Post a Comment