ఆయన స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు.. ఇర్ఫాన్ మృతిపై చిరంజీవి

బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడిన ఆయన బుధవారం మధ్యాహ్నం ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. ఇర్ఫాన్‌కు భార్య సుతాప, ఇద్దరు కుమారులు బబిల్, అయాన్ ఉన్నారు. ఇర్ఫాన్ మృతితో చిత్ర సీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేవలం బాలీవుడ్ ప్రముఖులే కాకుండా అన్ని సినీ పరిశ్రమల ప్రముఖులు ఇర్ఫాన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఇప్పటికే మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా సంతాపాన్ని వ్యక్తపరిచారు. ఇర్ఫాన్ ఖాన్‌తో కలిసి ‘సైనికుడు’ సినిమాలో మహేష్ నటించారు. అయితే, తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా ఇర్ఫాన్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్లు చేశారు. Also Read: ‘‘ఇర్ఫాన్ ఖాన్ మృతిచెందారనే ఘోరమైన వార్త విని చాలా బాధపడ్డాను. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన గొప్ప నటుడు ఆయన. ఆయన స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. ఆయన మంచి ప్రవర్తన మన హృదయాల్లో చెరగని ముద్ర వేస్తుంది. ప్రియమైన ఇర్ఫాన్, మేం మిమ్మల్ని కోల్పోతున్నాం. మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోలేం’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక రామ్ చరణ్ ట్వీట్ చేస్తూ.. ‘‘సినిమా ప్రపంచం కిరీటాన్ని కోల్పోయింది. అత్యంత అసాధారణ నటుల్లో ఆయనొకరు. సినీ పరిశ్రమ కచ్చితంగా ఒక దిగ్గజాన్ని కోల్పోయింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి ఇర్ఫాన్ ఖాన్ గారు’’ అని రామ్ చరణ్ పేర్కొన్నారు.
Comments
Post a Comment