అప్పటినుంచే ఆ హీరో అంటే క్రష్.. మనసులో మాట బయటపెట్టిన అనసూయ

న్యూస్ ప్రెజెంటర్‌గా కెమెరా ముందుకొచ్చిన ఆ తర్వాత బుల్లితెర, వెండితెర ప్రయాణాలు చేస్తూ ఫుల్ పాపులర్ అయింది. హీరోయిన్లతో సమానమైన క్రేజ్ కొట్టేసి జనం నోళ్ళలో నానుతూ ఉంది. అయితే ఆమె కెరీర్‌కి పునాది వేసి, టర్న్ చేసింది మాత్రం ఒక్క జబర్దస్త్ షో అనే చెప్పుకోవాలి. అందుకే అనసూయను అంతా జబర్దస్త్ బ్యూటీ అని ముద్దుగా పిలుచుకుంటారు. అలాగే ఆమెకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తన ఫేవరేట్ హీరో, ఆ హీరోతోనే క్రష్ అని అనసూయ స్వయంగా చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న అనసూయ భరద్వాజ్ రెగ్యలర్‌గా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటోంది. తన ట్విట్టర్, ఇన్స్‌స్టా ఖాతాల ద్వారా అభిమానులతో సరదాగా చిట్ చాట్ చేస్తూ తన కెరీర్, వ్యక్తిగత విషయాలను బయటపెడుతోంది. ఈ మేరకు తాజాగా జరిగిన చిట్‌చాట్‌లో మీకు నచ్చిన హీరో ఎవరు అనే ప్రశ్నపై బదులిచ్చిన అనసూయ.. తనకు హీరో అర్జున్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘జెంటిల్ మెన్’ మూవీ చూసిన తర్వాత ఆయన అభిమానిగా మారిపోయానని, ఒక్కమాటలో చెప్పాలంటే ఆ సినిమా చూడగానే ఆయనంటే క్రష్ ఏర్పడిందని చెప్పి షాకిచ్చింది అనసూయ. డైరెక్టర్ శంకర్ మొదటి చిత్రం 'జెంటిల్ మెన్'. హీరో అర్జున్‌తో ఈ సినిమా చేసిన ఆయన ఆ తర్వాత స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు. ఈ మూవీలో అర్జున్ రెండు విభిన్న తరహా పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. అది చూసే అనసూయ అర్జున్ ఫ్యాన్ అయిపోయిందట. ఇకపోతే ఇటీవలే రంగస్థలంలో రంగమ్మతగా, అదేవిధంగా 'కథనం'లో హోల్ అండ్ సోల్‌గా అదరగొట్టిన అనసూయ.. ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రంగమార్తాండ' చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తోంది. అలాగే అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాలోనూ ఆమె నటిస్తున్నట్లు టాక్. Also Read:
Comments
Post a Comment