అమెజాన్‌తో తేజ భారీ డీల్! సిచ్యుయేషన్ క్యాచ్ చేసుకుంటూ పక్కా ప్లాన్

రోజురోజుకూ టెక్నాలజీ విస్తృతం అవుతుండటంతో క్రమంగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌కి డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ (OTT)‌ వృద్ధి చెందుతూ అందరికీ చేరువవుతున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా విధించిన ఈ లాక్‌డౌన్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్స్‌కి మరింత బూస్టింగ్ ఇచ్చి అమెజాన్, ఆహా లాంటి ఓటీటీ వేదికలకు కస్టమర్లను పెంచేసింది. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న జనం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో సినిమాలు చూడటం అలవాటుగా మార్చుకున్నారు. దీంతో ఫ్యూచర్‌లో కూడా వీటికే డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ద‌ర్శ‌క నిర్మాత‌లు ఓటీటీ వైపు అడుగులేస్తున్నారు. సరిగ్గా ఇదే అంశాన్ని గ్రహించిన డైరెక్టర్ తేజ.. ఇప్పటి సిచ్యుయేషన్ క్యాచ్ చేసుకునేలా ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ అమెజాన్ ప్రైమ్‌తో భారీ డీల్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో మూడు వెబ్ సిరీస్‌లు, రెండు సినిమాలు నిర్మించేలా డీల్ కుదుర్చుకున్నాడ‌ని ఇన్‌సైడ్ టాక్. నేటితరం ప్రేక్షకులకు మరింత చేరువవుతూ ఇకపై డిజిటల్ రంగంలో రాణించాలని ఆయన ఫిక్స్ అయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవలే 'సీత' సినిమాతో డిసాస్టర్ ఖాతాలో వేసుకున్న తేజ.. ఇకపై పకడ్బందీ అడుగులేయబోతున్నారని తెలిసింది. ఈ మేరకు ఆయన ఇప్పటికే రాక్షస రాజు రావణాసురుడు సినిమాను దగ్గుబాటి రానాతో, అలాగే అలిమేలు మంగ వెంకట రమణ సినిమాను గోపీచంద్‌తో చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో తేజ- అమెజాన్ ప్రైమ్ మధ్య డీల్ జరిగిందన్న వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రెండు సినిమాలనే డైరెక్ట్‌గా అమెజాన్‌లో రిలీజ్ చేయనున్నారా? లేక డిజిటల్ వేదిక కోసం ఆయన వేరే కథలు సిద్ధం చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ