రిషి, ఇర్ఫాన్‌ల మృతిపై బాలకృష్ణ రియాక్షన్.. ఇది తీరని లోటు అంటూ ఆవేదన

వరుసగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీని కుదిపేసే సంఘటనలు చోటు చేసుకున్నాయి. దిగ్గజ నటులు ఇర్ఫాన్ ఖాన్, ఒక్క రోజు తేడాలో తిరిగిరాని లోకాలకు వెళ్లడం యావత్ సినీ లోకాన్ని షాక్‌కి గురిచేసింది. అనారోగ్యం కారణంగా ఏప్రిల్ 29న బాలీవుడ్ నటుడు మరణించగా, ఆ మరుసటి రోజే అనగా నేడు (ఏప్రిల్ 30) మరో విలక్షణ నటుడు రిషి కపూర్ కన్నుమూయడం జీర్ణించుకోలేక పోతున్నారు సినీ ప్రముఖులు. ఈ నమ్మలేని విషయాలపై రియాక్ట్ అవుతూ వారి ఆత్మలకు శాంతి చేకూరాలని పెద్ద ఎత్తున ట్వీట్స్ పెడుతున్నారు. ఇప్పటికే బిగ్ బీ అమితాబ్ బచ్చన్, సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, మహేష్ బాబు, అల్లు అర్జున్, తమన్నా, అనసూయ, తాప్సి, నిధి అగర్వాల్ లాంటి ఎందరో తారలు రిషి మృతిపట్ల తమ తమ ప్రగాఢ సానుభూతి తెలపగా, తాజాగా నందమూరి రియాక్ట్ అవుతూ ఆవేదన చెందారు. ''రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్ లాంటి ఇద్దరు నట దిగ్గజాలు మనకు దూరమవడం చాలా బాధాకరం. భారతీయ సినిమాకు ఇది తీరని లోటు.వారి చిత్రాల ద్వారా ఎప్పటికీ గుర్తుంటారు. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మలకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను'' అని బాలకృష్ణ పేర్కొన్నారు. పలు హిందీ చిత్రాల్లో హీరోగా నటించిన రిషికపూర్ అనారోగ్యానికి గురికావడంతో అతన్ని బుధవారం రాత్రి ముంబైలోని హెచ్ ఎన్ రిలయెన్స్ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స అందిస్తుండగా ఈ రోజు ఉదయం 8 గంటల 45 నిమిషాలకు ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. రిషి మరణవార్త తెలియగానే అతని సన్నిహితులు, కుటుంబ సభ్యులు సహా పలువురు సినీ ప్రముఖులు తమ తమ సంతాపం తెలుపుతున్నారు. Also Read:
Comments
Post a Comment