‘ఒక్కడు’ చూసి ఇండస్ట్రీకి వచ్చా.. నా కల నెరవేరుతోంది: పరశురామ్

‘యువత’ సినిమాతో టాలీవుడ్‌కి దర్శకుడిగా పరిచయమయ్యారు పరశురామ్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరవాత ‘ఆంజనేయులు’, ‘సోలో’ సినిమాలు దర్శకుడిగా పరశురామ్‌కు ఒక ప్రత్యేక శైలి ఉందనే గుర్తింపును ఇచ్చాయి. అయితే, ఎన్నో ఆశలతో రూపొందించిన ‘సారొచ్చారు’ సినిమా పరశురామ్‌కు షాక్ ఇచ్చింది. రవితేజ హీరోగా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీంతో స్పీడుకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. ఈ సినిమా తరవాత పరశురామ్‌కు మరో అవకాశం దక్కడానికి నాలుగేళ్లు పట్టింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇచ్చిన అవకాశాన్ని పరశురామ్ అందిపుచ్చుకున్నారు. అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠీలను హీరోహీరోయిన్లుగా పెట్టి ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ఆ వెంటనే ఇదే గీతా ఆర్ట్స్ సంస్థలో ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్‌కు దర్శకత్వం వహించారు. ఈ ఒక్క సినిమాతో పరశురామ్ మరోసారి తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబును డైరెక్ట్ చేయబోతున్నారు. మహేష్‌తో పరశురామ్ చేయనున్నట్టు చాలా రోజులుగా వార్తలు వస్తు్న్నాయి. వాటిని తాజాగా పరశురామ్ ఖరారు చేశారు. Also Read: గురించి, ఆయనతో చేయబోయే సినిమా గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పరశురామ్ మాట్లాడారు. ‘‘ఒక్కడు సినిమా చూసిన తరవాత ఇండస్ట్రీకి రావాలని నిర్ణయించుకున్నాను. మహేష్ సార్‌తో సినిమా చేయాలనదే నా బలమైన కోరిక. నా కల ఇప్పుడు నెరవేరబోతోంది. ఇది నా కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది’’ అని పరుశురామ్ అన్నారు. ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ వచ్చే సీన్లు, డైలాగులు రాయలేక కాదని.. ఇప్పటి వరకు తన సినిమాల్లో ఆ అవసరం పడలేదని పరశురామ్ చెప్పారు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చిందని.. తనలోని మరో యాంగిల్‌ను చూస్తారని వెల్లడించారు. తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో మానవ సంబంధాలు, కుటుంబ భావోద్వేగాలు అన్నీ ఉంటాయని పరశురామ్ చెప్పారు. ప్రస్తుతం తన స్క్రిప్టులో ఇవన్నీ పొందుపరుస్తున్నానని తెలిపారు. ఇది మంచి సబ్జెక్ట్ అని, అందుకే వదలకుండా దాన్నే పట్టుకున్నానని.. అది తనను వదలకుండా పట్టుకుందని చెప్పారు పరశురామ్. ఇది చాలా మంచి సినిమా అవుతుందని, నవరసాలు ఉంటాయని వివరించారు.
Comments
Post a Comment