కరోనాపై రాహుల్ సిప్లిగంజ్ ఉర్రూతలూగించే పాట.. విడుదల చేసిన కేటీఆర్

కరోనా వైరస్ వల్ల తలెత్తుతున్న పరిస్థితులపై రూపొందించిన ఓ ప్రత్యేక పాటను మంత్రి కేటీఆర్ మంగళవారం ఆవిష్కరించారు. కరోనా కట్టడిలో ప్రధానంగా సేవలందిస్తున్న వైద్య, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బంది సేవల్ని గుర్తు చేస్తూ బొంతు శ్రీదేవి ఈ పాటను రూపొందించారు. మంగళవారం ఈ పాటను ప్రగతిభవన్‌లో మంత్రి ఆవిష్కరించారు. ఈ గీతాన్ని కందికొండ రచించగా.. రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఆవిష్కరణ సంందర్భంగా గీతాన్ని విన్న మంత్రి కేటీఆర్.. దీనివల్ల ప్రజల్లో మరింత అవగాహన, చైతన్యం కలుగుతుందని అన్నారు. కరోనాపై చైతన్యం కలిగించేందుకు చొరవ చూపి పాటను నిర్మించిన హైదరాబాద్ మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి శ్రీదేవికి మంత్రి అభినందనలు తెలిపారు. Also Read: మరోవైపు, గజ్వేల్‌లో పేద బ్రాహ్మణ కుటుంబాలకు మంత్రి హరీశ్‌రావు నిత్యావసరాలను పంపిణీ చేశారు. తెలంగాణలో సోమవారం కేవలం 2 కరోనా కేసులే నమోదయ్యాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వ్యాధిని అరికట్టేందుకు ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు. మరిన్ని రోజులు లాక్‌డౌన్‌కు సహకరించి కరోనాను తరిమికొట్టాలని హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. Also Read:
Comments
Post a Comment