Be The Real Man: ప్రత్యేకత చాటుకున్న దేవిశ్రీ.. బన్నీ సహా ఐదుగురికి ఛాలెంజ్

ప్రస్తుతం టాలీవుడ్‌లో ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రారంభించిన ఈ ఛాలెంజ్.. రాజమౌళి లాంటి దర్శకధీరుడు ద్వారా పాపులర్ అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు ఈ ఛాలెంజ్‌లో పాలుపంచుకోవడంతో ఈ లాక్‌డౌన్ సమయంలో ఈ ఛాలెంజ్ తెలుగు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతోంది. ఇన్ని రోజులూ తెరపైన, తెర వెనుక ఉంటూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన టాలీవుడ్ స్టార్లు.. ఇప్పుడు ఇళ్లలో పనులు చేస్తూ అలరిస్తున్నారు. ఈ ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్‌లో భాగంగా ప్రముఖ దర్శకుడు సుకుమార్.. తనకు ఎంతో ఇష్టమైన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ను నామినేట్ చేశారు. సుకుమార్ ఛాలెంజ్‌ను స్వీకరించిన దేవి.. బుధవారం తన వీడియోను ట్వీట్ చేశారు. అయితే, ఈ వీడియో కాస్త వెరైటీగా ఉంది. దేవిశ్రీ స్టైల్‌లో చాలా ఎనర్జిటిక్‌గా ఉంది. వీడియో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. అన్నిటికీ మించి ఈ వీడియోలో దేవి తన మేనల్లుడిని భాగం చేయడం ఆసక్తికరం. నిద్రపోతున్న మావయ్యను లేపి మరీ పనులు చేయించాడు దేవి మేనల్లుడు తనవ్ సత్య. Also Read: దేవిశ్రీ చీపురుతో ఇల్లు ఊడ్చారు.. మాప్‌తో ఫ్లోర్ శుభ్రం చేశారు.. టీవీ, స్పీకర్స్, సోఫాలు అన్నీ క్లీన్ చేసేశారు.. తల్లికి ఆమ్లెట్ వేసి పెట్టారు.. ప్లేట్ కడిగేశారు.. డైనింగ్ టేబుల్, వాల్ మిర్రర్ క్లీన్ చేశారు.. చివరిగా తన తండ్రి సత్యమూర్తి గారి ఫొటోలను శుభ్రం చేసి దండం పెట్టకున్నారు. అమ్మకు కాఫీ కూడా పెట్టి ఇచ్చారు. ఈ వీడియో మొత్తం చాలా ఎనర్జిటిక్‌గా అనిపిస్తోంది. అయితే, ఈ ఛాలెంజ్‌లో భాగంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తమిళ హీరో కార్తి, కన్నడ రాక్‌స్టార్ యష్, డైరెక్టర్ హరీష్ శంకర్, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌లను నామినేట్ చేశారు.
Comments
Post a Comment